విశాఖలో బ్రాండిక్స్ సెజ్
అచ్యు తాపురం ప్రాంతంలో హెచ్‌ఐవి, టిబి వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిచేందుకు అవగాహన సదస్సులు నిర్వహి స్తున్నట్టు బ్రాండిక్స్ పబ్లిక్ రిలెషన్స్ మేనేజర్ లలంతి రాజపక్సే తెలిపారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన వస్త్రాలను తయారు ఉత్పత్తి చేసేందు కు ఈ అపరల్ పార్క్ ఒక వేదిక అయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు. 200 మెగావాట్‌లతో ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నూరు శాతం ఎగుమతుల ఆధారంగా ఏర్పాటైన ఈ సెజ్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోజుకు 60 మిలియన్ లీటర్ల నీటి సామార్థ్యం కలిగిన ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 20 మిలియన్ లీటర్లను నిత్య అవసరాలకు వినియోగిస్తున్నారు 400 వందల మిలియన్ లీటర్ల నీటి నిల్వలను ఉంచేందుకు నీటి గుంటలను ఏర్పాటు చేస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో టవర్‌ను ఏర్పాటు చేసింది.
విదేశాలకు ఎగుమతులు చేయడంలో ఎలాంటి సమస్యలు తలెతు్తకుండా హన్‌సైట్ కస్టమ్స్ శాఖలు కూడా ఏర్పాటు చేస్తు న్నారు. 30మీటర్ల రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 2012 నాటికి పూర్తి సామర్థ్యంతో ఈ కంపెనీ పని చేస్తుందని యాజమాన్యం చెబుతోంది. 2007 నుంచే ఎగుమతులను ప్రాంరంభించామని సంస్థ ప్రతినిధి జయవర్థన్ తెలిపారు. ఇందులో పని చేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు,పిఎఫ్, ఇతర సౌకర్యాలు వంటివి కల్పిస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయుత కారణంగా 2005లో శ్రీలంకకు చెందిన అంతర్జాతీయ వస్త్ర కంపెనీ బ్రాండెక్స్ ఇక్కడి సెజ్‌లో తమ కార్యాకలా పాలను బ్రాండిక్స్ ఇండియా సిటీ పేరుతో ప్రారం భించింది. ఈ సంస్థలో 2012 నాటికి దాదాపు 60 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పి చేందుకు వీలుగా ఇప్పటికే విస్తరణను చేపట్టింది. ప్రస్తుతం 3,200 మందికి ఇందులో ఉపాధి కల్పిం చింది. మరో 3వేల మందికి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్రాండిక్స్ కంపెనీ చర్యలు చేపడుతుంది.
Pages: -1- 2 News Posted: 12 July, 2009
|