ఎడబాటుతో అనారోగ్యం!
వైవాహిక బంధంతో కలిగే ప్రయోజనాలను ఏకరువు పెట్టిన సామాజిక శాస్త్రవేత్త లిండా 'మీరు సరిగా నిద్రపోలేరు అన్నం తిన బుద్ధి కాదు, వ్యాయామం చేయలేరు, స్నేహితుల్ని కలవాలనిపించదు, మొత్తం పరిసరాలన్నీ బాధకరంగా మారతాయని' చెబుతున్నారు.
దంపతుల్లో... ముఖ్యంగా భర్తకు జబ్బు చేస్తే తానే జబ్బు పడినట్లుగా భార్య భావిస్తుందని పరిశోధనల్లో తేలింది. అధ్యయనానికి ఎంచుకున్న 8,652 మందిలో 50 శాతం పైగా జంటలు తొలి వివాహాన్ని కొనసాగిస్తున్నాయి. 40 శాతం మంది భార్యను కోల్పోయిన వ్యక్తులు లేదా విడాకులు పొందినవారు, నాలుగు శాతం మంది బ్రహ్మచారులు. స్థూలంగా తేలిందేమిటంటే తమ జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న స్త్రీ, పురుషుల్లో 20 శాతం మంది మధుమేహం, క్యాన్సర్ వంటి మొండి రోగాల బారిన పడుతున్నారు.
భాగస్వామిని కోల్పోయిన వ్యక్తులు తిరిగి వివాహం చేసుకున్న తరువాత ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగు పడినట్లు కనిపించినా... తమ 'అర్ధ భాగాన్ని' కోల్పోయామన్న భావన నుంచి దూరం కాలేకపోతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలకు వైవాహిక బంధాన్ని కోల్పోవడమే కారణంగా ఈ అధ్యయనం నిరూపించలేకపోయింది. దంపతులు కలిసి మాత్రమే జీవించారని భావించవచ్చు. సరిగా వ్యాయామం చేయకుండా, తగిన తిండి తిననివారు మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని అంచనా! ఏది ఏమైనా... 'పెళ్ళి చేసుకొని... ఇల్లు కట్టుకొని హాయిగ కాలం గడపాలోయ్! ఎల్లరు సుఖమును పొందాలోయ్! మీరెల్లరు హాయిగా ఉండాలోయ్' అని ఆశిస్తే మాత్రం తప్పుకాదు!
Pages: -1- 2 News Posted: 10 August, 2009
|