వ్యక్తిగత రుణాలు కష్టమే
ముంబై : ఎవరైనా ఇకముందు ఏదైనా బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం కోరాలంటే ప్రొఫెషనల్ డిగ్రీ, వేతనం ఖాతా కలిగి ఉండాలి లేదా ఆ బ్యాంకులో అప్పటికే ఖాతాదారుడై ఉండవలసి ఉంటుంది. ఈ రుణాలు ఇక ఏమాత్రం అభద్రమైనవి కాలేవు. ఒక బ్యాంకుతో సదరు వ్యక్తికి అప్పటికే గల సంబంధాన్ని బట్టి రుణం మంజూరవుతుంది.
చాలా సందర్భాలలో బ్యాంకులు జీతం అకౌంట్ కోసం అడుగుతుంటాయి. రుణాన్ని నెలసరి జీతంతో ముడిపెడుతుంటారు. దీని వల్ల రుణ గ్రహీతకు ఎంత మొత్తం నగదు అందుబాటులో ఉందో తెలుస్తుంది. నిర్దుష్టంగా వేతనాలు లభించే కస్టమర్లు లేదా తమ శాఖలలో ఖాతాలు ఉన్న కస్టమర్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తమ రుణాలకు భద్రతను చేకూర్చుకోవడానికి ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకుల పంథాను అనుసరిస్తున్నాయి.
రుణ గ్రహీతల రుణ చరిత్ర బాగుంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా ప్రైవేట్ బ్యాంకులు ఇంతకుముందు రుణాలు ఇస్తూ వచ్చాయి. రుణం పొందడానికి సేలరీ స్లిప్ సమర్పిస్తే సరిపోయేది. కాని ఇప్పుడు కస్టమర్ ఆర్థిక స్తోమత, ఉద్యోగానుభవం, అతను పని చేసే సంస్థ వంటి అంశాలపై బ్యాంకులు దృష్టి పెడుతున్నాయి.
'ఏ కస్టమర్ అయినా సవ్యమైన రుణ చరిత్ర ఉంటే రుణం పొందవచ్చు. వివిధ బ్యాంకుల నుంచి వివిధ రుణాలు పొందడానికి దానిని ఉపయోగించుకోవచ్చు. ఈ తరహా రుణాలకు క్రమంగా స్వస్తి చెప్పడం జరుగుతోంది' అని ప్రైవేట్ బ్యాంకర్లు వివరించారు.
Pages: 1 -2- News Posted: 26 August, 2009
|