14 మంది భార్యల మొగుడు
వాఘ్మరే వివాహాల పోర్టల్స్ లో యువతుల వివరాలను పరిశీలిస్తుండేవాడు. లోఖండ్ వాలా లేదా జోగేశ్వరిలో గల తాను అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్లలో ఒకదానిలో అతను వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యేవాడు. 'అతను చేస్తున్న ఉద్యోగం చూసి ముగ్ధులైనందున ఆ మహిళలు గాని, వారి తల్లిదండ్రులు గాని అతని పూర్వాపరాలను తనిఖీ గురించి ఎన్నడూ ఆలోచించనేలేదని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపి) ఆర్.ఎం. వాట్కర్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో చెప్పారు. వాఘ్మరే ఒక్కొక్క భార్యతో కనీసం మూడు రోజులు వరుసగా గడిపేవాడని, తరువాత అధికారిక సమావేశాలకు హాజరయ్యేందుకు తాను ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసి ఉందని వారితో చెప్పేవాడని వాట్కర్ తెలిపారు.
'స్టాంపు పేపర్ పై రాసి సంతకం చేసిన, నోటరీ స్టాంపు ఉన్న బోగస్ విడాకుల పత్రాన్ని చూపిన అనంతరం వాఘ్మరే ఆ మహిళలను వివాహం చేసుకున్నాడు. వాఘ్మరేకి సంబంధించిన ఐదు వేర్వేరు పెళ్ళి ఫోటోలను మేము సంపాదించగలిగాం' అని సీనియర్ ఇన్ స్పెక్టర్ విజయ్ రౌత్ చెప్పారు. ఆ ఐదు ఫోటోలలో ప్రతిదానిలోను ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుండడం గమనార్హం. వారిలో ఒకడు వాఘ్మరే తండ్రిగాను, మరొకడు అతని బాబాయిగాను నటిస్తుండేవారు.
'తన మొదటి భార్య 2006లో విడాకులు ఇచ్చిన దరిమిలా వాఘ్మరే ఒక మహిళ తరువాత మరొకరిని వివాహం చేసుకోసాగాడు. తాను బ్రాహ్మణ యువతులను పెళ్ళి చేసుకోవడానికి వీలుగా వాఘ్మరే తన ఇంటి పేరును బాపట్ (బ్రాహ్మణుడని సూచించే ఇంటిపేరు)గా మార్చుకున్నాడు' అని ఇన్ స్పెక్టర్ శివాజీ ఫడ్తరే చెప్పారు.
ఆగస్టు 11న ములుంద్ లో 29 ఏళ్ళ ఆర్కిటెక్ట్ ను వివాహం చేసుకున్న తరువాత వాఘ్మరే చివరికి పట్టుబడ్డాడని, ఆమె విడాకులు తీసుకున్న యువతి అని, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడని పోలీసు అధికారులు తెలియజేశారు. వాఘ్మరే మొండి ధైర్యం చూసి తాము విస్తుపోయామని వారు తెలిపారు. ఆ ఆర్కిటెక్ట్ తల్లిదండ్రులు లోఖండ్ వాలాలోని అతని ఇంటికి వచ్చినప్పుడు అతను తన ఇతర భార్యలలో ఒకరితో కలసి ఉంటున్నాడని, అతను రెండు గంటల పాటు మార్కెటింగ్ కోసం అప్పుడే ఆమెను పంపాడని అధికారులు చెప్పారు.
లోనవాలాలో హనీమూన్ నుంచి వారు తిరిగి వచ్చిన మూడు రోజుల తరువాత అతని చివరి భార్య తనను తన అధికారులు ఒక పని మీద ఢిల్లీ వెళ్ళవలసిందిగా కోరినట్లు వాఘ్మరేతో చెప్పింది. 'నీకు ఇష్టం వచ్చినంత సమయం తీసుకోవలసిందని, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తిరిగి రావచ్చునని వాఘ్మరే చెప్పడంతో నేను దిగ్భ్రాంతి చెందాను. నాకు వివాహేతర సంబంధాలు ఉన్నా తాను పట్టించుకోనని అతను చెప్పినప్పుడు నేను మరింత షాక్ తిన్నాను. దీనితో నేను ఆగస్టు 16న లోఖండ్ వాలాలోని అతని ఫ్లాట్ కు వెళ్ళాను. అప్పుడు నేను 29 ఏళ్ళ మహిళను కలుసుకున్నాను. వాఘ్మరే తనను 2009 ఏప్రిల్ లో వివాహం చేసుకున్నట్లు ఆమె చెప్పింది' అని బాధితురాలు తన ఫిర్యాదులో వివరించింది.
వాఘ్మరే 2006 నుంచి ఎయిర్ ఇండియా ఉద్యోగినులను లైంగికపరంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై తాము శాఖానుగత దర్యాప్తు జరుపుతున్నట్లు తెలియజేస్తూ ఎయిర్ ఇండియా సంస్థ నుంచి తమకు ఒక లేఖ అందిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతనిని ఆగస్టు 29 వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్ చేశారు.
Pages: -1- 2 News Posted: 27 August, 2009
|