సిరంజ్ ఇక అనవసరం!
పొంగు చికిత్సకు శరీరంలోకి వ్యాక్సిన్ ను చేరవేసేందుకు కొత్త మార్గాన్వేషణలో కొలరాడ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ సీవర్స్ నిమగ్నమయ్యారు. ఈ వ్యాధికి వ్యాక్సినేషన్ పాశ్చాత్య వర్గాలలో వివాదాస్పదంగా మారింది. అతిశయోక్తులతో కూడుకున్న రెండు వైజ్ఞానిక అధ్యయనాలే ఇందుకు కారణం. ఈ వ్యాక్సిన్ ఎప్పుడైనా ముప్పు కలిగించవచ్చునని అవి సూచించాయి. (అయితే, అది తప్పుడు సూచన అని ఇప్పుడు భావిస్తున్నారు.)
అయితే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో అసలు పొంగు వ్యాధే తీవ్ర అపాయకరమైనది. దాని వల్ల ఏటా దాదాపు రెండు లక్షల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. దానిని నివారించేందుకు ద్రవపూరిత వ్యాక్సిన్ ను, హైపోడెర్మిక్ సూదిని ఉపయోగిస్తూ ఇంజెక్షన్ ఇవ్వడమే ఏకైక మార్గం. ఎందుకంటే శ్వాస నాళం ద్వారా పొంగు దుష్ప్రభావం చూపుతుంది. అయితే, చేతికండరాల ద్వారా కన్నాఈ వ్యాక్సిన్ ను చేరవేయడానికి శ్వాసనాళమే సరైన ప్రదేశమని డాక్టర్ సీవర్స్ అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సినేషన్ చేయించుకోవలసిన వ్యక్తిని మృదువైన పొడి రూపంలోని వ్యాక్సిన్ ను పీల్చేట్లు చేయడం ఒక పద్ధతి. అది సదరు వ్యక్తి ఊపిరితిత్తులలో ప్రతి అంగుళం వ్యాపిస్తుంది.
అటువంటి పొడిని తయారు చేయడానికి డాక్టర్ సీవర్స్ ఒక ఉపాయం పన్నారు. ఈ పద్ధతి కింద ద్రవపూరిత వ్యాక్సిన్ ను చిన్న చిన్న బొట్లుగా మారుస్తారు. వాటిలోని నీరు ఆవిరైనప్పుడు వ్యాక్సిన్ కణాలు ఎంత చిన్నగా ఉంటాయంటే అవి ఎక్కడా చిక్కుకోకుండా ఊపిరితిత్తుల ద్వారా వ్యాపించగలవు. అయితే ఇది పైకి చెబుతున్నంత తేలిక కాదు.
ఆటమైజేషన్ నాజిల్స్ సర్వత్రా కనిపిస్తాయి. పెర్ఫ్యూమ్ సీసాల నుంచి కారు ఇంజన్ల వరకు అన్ని చోట్లా వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే, నాజిల్ ఒక్కటే సరిపోదు. అది ఉత్పత్తి చేసే బొట్లు, తద్వారా వచ్చే పొడి కణాలు డాక్టర్ సీవర్స్ సంకల్పించిన ప్రయోజనాన్ని నెరవేర్చడానికి కష్టమైనంత పెద్దవి. దానికి బదులుగా ఆయన అత్యంత అధిక ఒత్తిడి గల కార్బన్ డై యాక్సైడ్ తో వ్యాక్సిన్ ను మిళితం చేయడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
ఈ మిశ్రమం నాజిల్ లో నుంచి వెలువడినప్పుడు షాంపేన్ లా ఒక్కసారి బుడగలతో పెల్లుబుకుతుంది. ఆ బుడగలు చిన్న చిన్న బొట్లుగా మారిపోతాయి. అవి ఎండిపోయినప్పుడు ఒక పొడి అక్కడ మిగులుతుంది. దానిలోని కణాలు ఒకటి, ఐదు మైక్రాన్ల మధ్య ఉంటాయి. ఈ పొడిని వ్యక్తిగత డోసులుగా సులభంగా అందజేయవచ్చు, ఒక బ్లాడర్ లో నుంచి దీనిని పీల్చవచ్చు. అలా చేసిన ఒక కోతిని ఇన్ ఫ్లుయెంజా బారి నుంచి రక్షించారు. వచ్చే సంవత్సరం ఇండియాలో మనుషులపై ప్రయోగాలు ప్రారంభం కావచ్చు.
Pages: -1- 2 News Posted: 2 September, 2009
|