ఇన్ ఫ్రా కంపెనీలకు దెబ్బ?
చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి వంటి ముఖ్యమంత్రులను కలిగి ఉన్నందుకు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు 'అదృష్టవంతులు' అని డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి వ్యాఖ్యానించారు. 'నాకు చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డితో చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్నది. వారి వంటి దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులను కలిగి ఉండడం మా రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అదృష్టమేనని నేను మా పారిశ్రామిక మిత్రులతో ఎప్పుడూ అంటుంటాను' అని ఆయన చెప్పారు.
రాజశేఖరరెడ్డి అనుసరిస్తున్న 'పెట్టుబడుల అనుకూల విధానాల' కారణంగా దేశ విదేశాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడులు వస్తున్నాయని అస్సోచామ్ అధ్యక్షుడు సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు.
అయితే, రాజశేఖరరెడ్డి హయాంలో సమస్యలను ఎదుర్కొన్న పారిశ్రామికవేత్తలు కొందరు లేకపోలేదు. వారిలో ప్రముఖమైనది రామోజీరావు అజమాయిషీలోని ఈనాడు గ్రూపు. తెలుగు దినపత్రిక, టెలివిజన్ చానెల్స్ తో పాటు ఆ గ్రూపులో మార్గదర్శి ఫైనాన్స్, చిట్ ఫండ్స్ సంస్థ, రామోజీ ఫిలిమ్ సిటీ కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) నిబంధనలను ఉల్లంఘించినందుకు, అసైన్డ్ భూములు కొనుగోలు చేసినందుకు ఆ గ్రూపుపై కేసులు దాఖలయ్యాయి. ఇక రాజశేఖరరెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా 'పక్షపాతంతో కూడుకున్నది, కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నది' అని 'ఈనాడు'పై విరుచుకుపడుతుండేవారు. ఆయన కుమారుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి ఈనాడుకు వ్యతిరేకంగా సాక్షి గ్రూపు వార్తాపత్రికలను ప్రారంభించడం కాకతాళీయం కాదు కదా!
అదే విధంగా నాగార్జున ఫెర్టిలైజర్స్ గ్రూప్ చైర్మన్ కె.ఎస్. రాజును అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆయన గ్రూపులోని నాగార్జున ఫైనాన్స్ సంస్థ వేలాది మంది ప్రజల నుంచి సమీకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించలేకపోయినప్పుడు రాజును అరెస్టు చేశారు. నాగార్జున ఫైనాన్స్ సంస్థ బోర్డులో డైరెక్టర్ అయిన జెఎం ఫైనాన్షియల్ చైర్మన్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ నిమేష్ కంపానిపై కూడా అరెస్టు వారంట్ జారీ అయింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజు కేసు వాటన్నిటిలోకి అత్యంత ప్రముఖమైనది. అకౌంటింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడినందుకు రామలింగరాజును అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే, ఈ విషయంలో రాజశేఖరరెడ్డికి దురుదేశాలను ఎవరూ ఆపాదించలేదు.
వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ప్రధాన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు:
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ - రూ. 12,132 కోట్లు
ఎన్టీపిసి-భెల్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ. 6000 కోట్లు
వాడరేవు - నిజాంపట్నం పోర్ట్స్, ఇండస్ట్రియల్ కారిడార్ - రూ. 16,800 కోట్లు
కృష్ణపట్నం రేవు - రూ. 10,000 కోట్లు
గంగవరం రేవు - రూ. 14,450కోట్లు
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హెలికాప్టర్ ఉత్పత్తి యూనిట్ - రూ. 1,000 కోట్లు
84 ఇరిగేషన్ ప్రాజెక్టులు - రూ. 1.76 లక్షల కోట్లు
Pages: -1- 2 News Posted: 5 September, 2009
|