డాక్టర్లే రోగులైతే...
అయితే, 'మీరు చెప్పేది చేసి చూపించండి' అనే పెద్దల సూక్తి వైద్యుల విషయంలో ఆచరణలో కనిపించదు. 'చాలా మంది డాక్టర్లు ఆరోగ్య పరీక్ష చేయించుకోవలసిందని తమ రోగులకు సిఫార్సు చేస్తుంటారు. కాని తమకు తాము అటువంటి పరీక్షలు చేయించుకోరు. వారు సకాలంలో ఆహారం తీసుకోరు. ఇక వ్యాయామం (ఎక్సర్ సైజ్) చేసే వైద్యులు పది శాతంలోపే ఉంటారు' అని ఉదయ్ క్లినిక్ కు చెందిన స్పైన్ సర్జన్ డాక్టర్ రాఘవ దత్ చెప్పారు. సర్జన్లు, స్పెషలిస్టులు కూడా ఇదే కోవలోకి వస్తారని ఆయన పేర్కొన్నారు.
సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒకరు 15 ఏళ్ళకు పైగా రక్తపు పరీక్ష చేయించుకోని ఒక ఉదంతాన్ని డాక్టర్ దత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 'అయితే అదృష్టవశాత్తు ఆయన రిపోర్టులు మామూలుగానే ఉన్నాయి. కాని తమకు రుగ్మతలు ఉన్నట్లు రక్త పరీక్షలో తేలినప్పుడు అది లేబరేటరీ తప్పుగా డాక్టర్లు తోసిపారేసే ధోరణి ఉన్నది. 'ఆ లాబ్ రిపోర్టులు ఎప్పుడూ లోపభూయిష్టంగానే ఉంటాయి' అని వారంటుంటారు. తాము మరొకసారి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే వారు వాస్తవం గ్రహిస్తుంటారు' అని డాక్టర్ దత్ చెప్పారు. చాలా మంది డాక్టర్లు గుండెకు పరీక్షలు చేయించుకోరని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సిఫార్సు చేస్తున్న ప్రకారం ఇలా చెకప్ లు చేయించుకుంటుండాలని డాక్టర్ దత్ పేర్కొన్నారు.
కొసమెరుపు: అదేపనిగా తుమ్ముతున్న, చీదుతున్న ఒక డాక్టర్ తన వద్దకు వచ్చిన ఒక రోగికి తగిన 'బెడ్ రెస్ట్' తీసుకోవలసిందని సలహా ఇచ్చినప్పుడు ఆ రోగి డాక్టర్లు సాంప్రదాయంగా చేసే ప్రమాణ స్వీకారం బదులు మరేదైనా ప్రమాణం స్వీకరించారా అని ప్రశ్నించారు. అప్పుడు ఆ డాక్టర్ 'అదేమీ కాదు. నా ప్రిస్క్రిప్షన్ ను చదవడం నాకు కూడా కష్టం' అని సమాధానం ఇచ్చారు.
Pages: -1- 2 News Posted: 10 September, 2009
|