తాతతో వస్తే డిస్కౌంట్!
అయితే, వృద్ధులైన కస్టమర్ల పట్ల రెస్టారెంట్లు మరింత ఆప్యాయంగా, మర్యాదగా వ్యవహరించవలసి ఉంటుందని ఉమా గణపతి సూచించారు. తమకూ విలువ ఉన్నదనే అభిప్రాయం వృద్ధులకు కలిగించడం అత్యంత ప్రధానమని ఆమె కొన్ని అధ్యయనాలను ప్రస్తావిస్తూ సూచించారు. 'సర్వీసులో వేగం కన్నా వ్యక్తిగతంగా శ్రద్ధ ప్రదర్శిస్తే వృద్ధులు సంతృప్తి పడగలరు. రెస్టారెంట్ సిబ్బంది ఈ విషయం గ్రహించడం అవసరం' అని ఉమా గణపతి అన్నారు.
వృద్ధుల అవసరాల పట్ల సిబ్బందికి ఇతోధిక అవగాహన కల్పించాలని హోటల్ పరిశ్రమ సంకల్పించినట్లు దీపక్ శర్మ వెల్లడించారు. 'ఇతరులతో పోలిస్తే వృద్ధుల అవసరాలు భిన్నమైనవి. వారి పట్ల ఏవిధంగా మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలో, తమకూ ప్రాముఖ్యం ఉందని వారు భావించేలా ప్రవర్తించడంలో సిబ్బందికి తర్ఫీదు ఇవ్వవలసి ఉంటుంది' అని ఆయన సూచించారు.
కాగా, ఈ ప్రతిపాదన అనేక మందిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది. 'మేము ఎన్ని సార్లు అడిగినా మా నాయనమ్మ మాతో కలసి బయట భోజనం చేయరు. హోటల్ వాతావరణం తనకు సరిపడదేమోనని ఆమె భయపడడమే ఇందుకు కారణం' అని ఢిల్లీ కరోల్ బాగ్ వాసి 15 సంవత్సరాల అన్షికా శర్మ చెప్పింది. 'అయితే, వృద్ధులకు సుకరంగా ఉండే ఏర్పాట్లు జరిగినట్లయితే ఆమె ఈసారి మాతో పాటు బయటకు వచ్చేలా నేను చూడగలను' అని ఆమె చెప్పింది.
'మా పిల్లలు ఎన్ని సార్లు అడిగినా నేను వారితో కలసి బయట భోజనం చేయను. ఎందుకంటే నేను ఆ వాతావరణం ఆహ్లాదంగా ఉండదు' అని 70 ఏళ్ళు పైబడిన ఢిల్లీ తూర్పు కైలాష్ వాసి జి.ఎస్. అమ్రోహి చెప్పారు.'కాని డిస్కౌంట్ ఆఫర్ ఉన్నట్లయితే నేను ఈ సారి వారితో కలసి బయటకు వెళ్లవచ్చు' అని ఆయన అన్నారు.
అయితే, కుటుంబాలు కూడా పెద్దల పట్ల హుందాగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఉమా గణపతి హెచ్చరించారు. 'వృద్ధులను డిస్కౌంట్ కూపన్ గా పరిగణించే ధోరణి యువతరంలో ఉండగలదు' అని ఆమె అన్నారు.
Pages: -1- 2 News Posted: 26 September, 2009
|