గర్భం సెక్స్ కు ఆటంకమా? ప్రసవం తరువాత రెండు, మూడు కారణాల వల్ల కలయికకు దూరంగా వుండవలసివుంటుంది. మొదటి కారణం, మామూలు ప్రసవం తరువాత బాలింతకు యోనిద్వారంలో కుట్లు పడటం. దీని వల్ల లైంగికచర్య బాధాజనకం అవుతుంది. పురుషునికి సంతృప్తీ కలగదు. రెండో కారణం, ప్రసవం తరువాత గర్భాశయం మునుపటి కన్నా పదింతలు పెద్దది కావటం. ఇది యథాస్థితికి రావాలంటే, దాదాపు ఆరు నెలల కాలం పడుతుంది. గర్భాశయం పెద్దది కావటం, శిశువుకు స్తన్యం ఇస్తుండటం వల్లా, హార్మోనుల మార్పుల వల్లా, స్త్రీకి సహజంగానే లైంగికకార్యక్రమం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.
మునుపటిలా కలయికలో పాల్గొనేందుకు శరీరమూ అంగీకరించదు. ప్రసవం తరువాత రెండు వారాలకే కలయికలు జరుపుకోవచ్చని వైద్యులు అంటారు కానీ, ప్రసవబాధ వల్ల అలసిన స్త్రీ శరీరం కలయికకు సిద్ధం కాదు. అంతే కాకుండా, లైంగికక్రియకు అంగీకరించకపోవటానికి, ప్రసవం తరువాత రక్తస్రావం దాదాపు 40 రోజుల వరకూ వుండటం మరో కారణం అవుతుంది. అందుకని సంపూర్ణంగా విశ్రాంతి తీసుకుంటేనే కానీ దంపతుల మధ్య సుఖదాయకమూ, ఆనందదాయకమూ అయిన సెక్స్ జరిగే అవకాశం వుండదు.
సామాన్యప్రసవం తరువాత, స్త్రీని, వారం తరువాత పూర్తిగా చెక్ అప్ చేయించుకునేందుకు పిలుస్తారు. ఆ సమయంలోనే ప్రసవం తరువాత వేసిన కుట్లు సరిగ్గా వున్నాయో లేదో; గర్భాశయం పరిస్థితి ఎలా వుందో, పరీక్షల ద్వారా తెలుస్తుంది. గర్భనిరోధకాలను గురించీ వారికి అప్పుడే చెబుతారు. సిజేరియన్ అయితే పది రోజుల తరువాత కుట్లను తీసేస్తారు. సిజేరియన్ చేయించుకున్న స్త్రీలు కూడా రెండు వారాల తరువాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. సామాన్యప్రసవాలూ, సిజేరియనులూ అయిన మహిళలకు, డాక్టర్లు, చెక్ అప్ కోసం వచ్చినప్పుడు కౌన్సెలింగ్ చేస్తారు. ఆ సమయంలోనే, వారెప్పుడు సెక్స్‌లో పాల్గొనవచ్చో, ఎప్పుడు గర్భనిరోధకాలు వాడాలో కూడా సలహా ఇస్తారు. వాటిని పాటించుకుంటూ, సుఖమయసంసారం గడపవచ్చు.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|