కండోమ్స్ తో జాగ్రత్త! వయాగ్రా వంటి మందులు వాడడం వల్ల, పురుష జననాంగ పరిమాణం పెరిగిపోతుంది. దాంతో కండోమ్స్ (బిగుతు) టైట్ అయిపోయి, రతి సమయంలో అవి చిరిగిపోయే అవకాశం ఏర్పడుతోంది. అందుచేత, లేపన శక్తి మందులు వాడేవాళ్లు, కొంచెం పెద్దసైజు కండోమ్స్ వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాక, ఎక్కువసేపు సంపర్కం చెయ్యడం కూడా కండోమ్స్ చిరిగిపోవడానికి కారణమనే విషయాన్ని గుర్తుంచుకుని, అవసరమైతే సంపర్క సమయంలో, మరో కొత్త కండోమ్ ఉపయోగించడం మంచిదని హెచ్చరిస్తున్నారు.
కండోమ్స్ వాడేవాళ్లకి తరచుగా కండోమ్స్ జారిపోవడం, సంపర్క సమయంలో లేపన శక్తి తగ్గిపోవడం కూడా జరుగుతోంది. కనుక, నాణ్యమైన కండోమ్స్ వాడితేనే కుటుంబ నియంత్రణకీ, సుఖవ్యాధులు సోకకుండా నివారించడానికి కూడా మంచిదని, వైద్య శాస్త్రవేత్తలూ, పరిశోధకులూ సూచిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|