జీతం తగ్గించుకున్న ముఖేష్
ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు. తన ఐదు లిస్టెడ్ సంస్థల నుంచి ఆయన రూ. 52 కోట్లకు పైగా ఆర్జించారు. నిబంధనల ప్రకారం ఏ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ అయినా ఒకటి కన్నా ఎక్కువ సంస్థల నుంచి తన పారితోషికం తీసుకోవచ్చు. కాని మొత్తం పారితోషికం ఏదో ఒక కంపెనీ గరిష్ఠ పరిమితి 5 శాతానికి లోబడి ఉండాలి.
దేశంలోని అగ్ర శ్రేణి సంస్థలలో ఏదీ కూడా 5 శాత పరిమితికి దగ్గరగా చెల్లించడం లేదు. 50కి పైగా ఏళ్ళ క్రితం కంపెనీలు తక్కువ లాభాలు అర్జించిన సమయంలో నిర్దేశించిన పరిమితి అది.
ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీకి, ఆయన ఇద్దరు కజిన్లు నిఖిల్, హితల్ మేస్వానీలకు చెల్లించే మేనేజీరియల్ పారితోషికాన్ని నికర లాభాలలో 0.402 శాతానికి పరిమితం చేసింది. ఇందులో నుంచి ముఖేష్ అంబానీకి రూ. 44 కోట్లు వచ్చాయి. 2007-08 సంవత్సరంలోని నికర లాభాలు రూ. 19,458 కోట్లలో ఇది 0.23 శాతంగా ఉన్నది.
రూ. 15 కోట్ల పారితోషికం నికర లాభాలలో 5 శాతం గరిష్ఠ పరిమితి కన్నా 98 శాతం మేరకు తక్కువ' అని సంస్థ మీడియాకు విడుదల చేసిన తన ప్రకటనలో తెలియజేసింది.
2008-09 సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ. 15,637 కోట్ల మేరకు నికర లాభాన్ని ఆర్జించింది. అనుమతించిన వివిధ పద్దుల కింద మినహాయింపులను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఇందులో 5 శాతం పరిమితి రూ. 805 కోట్లుగా తేలుతున్నది.
Pages: -1- 2 News Posted: 16 October, 2009
|