ఐటీ జంటల కొట్లాటలు ఇద్దరం ఐటీ అయితే.. 'నీకూ నాకూ తిరుగులేదు. చల్ మోహనరంగా' అంటూ పెళ్ళిళ్ళు చేసుకున్న ఐటీ జంటల కాపురాల్లో... ఉద్యోగాల్లో కోతలు, వేతనాల్లో తగ్గింపులు తీరని కలతల్ని సృష్టిస్తున్నాయి. దేశంలో బెంగళూరు తరువాత ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ లో ఐటీ దంపతుల మధ్య విభేదాలు చోటుకున్న కేసులు పెరుగుతున్నాయి. భార్యాభర్తలో ఎవరో ఒకరికి ఉద్యోగం పోవడం. మరో చోట ఉద్యోగం లభించకపోవడం. లేదా జీతాలు కోత పడటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం కృష్ణయ్య మాట్లాడుతూ, హైదరాబాద్ లో 20 జంటలు ప్రతిరోజూ పోలీసులను ఆశ్రయిస్తుంటే, వారిలో 15 జంటలు ఐటీవేనని తెలిపారు.
మాదాపూర్ కు చెందిన ఒక జంటలో భర్తకు ఉద్యోగం పోయింది. తనతో భర్త ఎక్కువ సమయం కడపడం లేదని పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. భర్త శైలిపట్ల అసంతృప్తిగా ఉన్న ఆమె... నిరాశ నుంచి బయట పడాలని భర్తను కోరింది. కానీ... ఆఫీస్ నుంచి భార్య ఆలస్యంగా వచ్చినా భర్త విసుక్కోవడం ప్రారంభించాడు. స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలకు వెళ్ళడం పై భర్త ఆంక్షలు విధించాడని పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
ఉద్యోగం పోగొట్టుకున్న భర్త... తన క్రెడిట్ కార్డుతో తాగితందనాలు ఆడుతున్నాడని మరో ఐటీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రిళ్ళు తాగి ఇంటికి వచ్చాక తనను హింసిస్తున్నాడని కూడా తెలిపింది. ఈ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ 'తాగుబోతు' భర్త హైదరాబాద్ లో కనిపించడం లేదు. తమకు అనేక ఫిర్యాదులు వస్తున్న అన్నింటినీ కేసులుగా నమోదు చేయడం లేదని ఏసీపీ కృష్ణయ్య చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఐటీకి చెందిన జంటల కేసులు 300లకు పైగా నమోదయ్యా యన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన జంటలకు తొలుత కౌన్సెలింగ్ ఇస్తున్నామని, తప్పనిసరైతేనే కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు.
Pages: -1- 2 News Posted: 26 October, 2009
|