భార్య వద్దకు తండ్రిని... ఒక డాక్టర్ దగ్గరకు తీసుకొనిపోగా ఆమెకు పిల్లల్ని కనే యోగం లేదని తేల్చారు. అయితే... అనుమానం వచ్చిన కోడలు - సెంకడ్ ఒపీనియన్ పేరిట మరో గైనకాలజిస్టును సంప్రతించగా, ఆమెకు పిల్లల్ని పొందడానికి వైద్య పరమైన ఇబ్బందులు ఏమీ లేవని తెలిసింది. దీనీపై అత్తింటి వారితో తగువు పడగా, అసలు విషయం మెల్లగా చెప్పారు. ధర్మేష్ కు వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని కూడా సూచించారు.
రెండు నెలల క్రితం కోడలు ఒంటరిగా ఉన్న సమయంలో మామ విమల్ గోపియాని నిద్రమాత్రలు ఇచ్చాడు. ఆమె మత్తులోకి పోయిన తరువాత మామ అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిపై తన భర్తకు ఫిర్యాదు చేయగా... 'అవును... పథకం ప్రకారమే జరిగింది' అని చెప్పాడు. కోడలు కేకలు వేయడానికి ప్రయత్నించగా... ఇంకా ఎక్కువ నిద్రమాత్రలు బలవంతంగా మింగించారు. గదిలో చస్తుందని వదిలేసి వెళ్ళారు. అయితే... బాధితురాలు ఎలాగో సెల్ ఫోన్ చేజిక్కించుకుని తల్లితండ్రులకు ఫోన్ చేయడంతో ప్రాణం దక్కింది. పోలీసు కేసుకు భయపడిన అత్తింటివారు ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. షాక్ నుంచి తేరుకున్నాక, ధైర్యం కూడగట్టుకుని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మామ డాక్టర్ కానప్పటికీ క్లినిక్ నడుపుతున్నట్లు కూడా ఫిర్యాదు చేసింది.
Pages: -1- 2 News Posted: 27 October, 2009
|