వంటతో శృంగారం మహిళల గుత్త సొత్తుగా భావించే వంటపనుల్లో పురుష పుంగవులు 'కాస్త' సాయం చేస్తే, ప్రతిగా మగువలు తమ భాగస్వాముల 'పొంది'కతో కృతజ్ఞతలు తెలుపుతారని పరిశోధకుల బృందం అంచనా వేసింది. వంటింటి పనులను పంచుకోవడం వల్ల కలిగే ప్రభావం స్త్రీ-పురుషలు ఇద్దరిలోనూ కనిపించిందని గేజర్ తెలిపారు. ఈ అంశంపై అధ్యయనానికి 6,877 మంది జంటల ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్నారు. వయస్సు, ఆరాటం, వైవాహిక సంతృప్తి వరకే అధ్యయనం పరిమితమైంది. ఇంటిని శుభ్రం చేయడం, భోజనం తయారీ, పాత్రలు తోమడం, దుస్తులు ఇస్త్రీ చేయడం అంటూ ఇంటి పనులను తొమ్మిది రకాలుగా విభజించారు. వంట, ఇంటిపనుల్లో సాయం వల్ల భార్యలు అధిక సమయం తమ భర్తలతో గడిపేందుకు వీలు చిక్కింది.
అంతకు ముందు వారానికి 23.4 గంటల పాటు భర్తలతో గడిపే భామలు ఇప్పుడు 41.8 గంటలపాటు ఉంటున్నారు. అదే విధంగా ఏడాదిలో 82.7 సార్లు, వారంలో 1.6 సార్లు శృంగారం చేస్తున్నట్లు తేలింది. మగవాళ్ళకు ఇంటి పనుల్లో సంబంధం ఉండటం వల్ల... భార్యలపై అనురాగం పెంచుకుంటారని 2003 నాటి సర్వేలో తేల్చారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ ప్రొఫెసర్ స్కాట్ కాల్ ట్రానే అదే విధంగా 2006లో 288 మంది జంటలపై అధ్యయనం చేసిన నేల్ నేతిక్ కూడా వంటింటి పనులను ఆలుమగలు పంచుకోవడం వల్ల సరసంలో సంతృప్తి అనుభవిస్తారని వివరించారు.
వైవాహికం, కుటుంబ వ్యవరాల కౌన్సెలింగ్ నిపుణరాలు రాబీబాబీన్స్ - వాగ్నర్ మాట్లాడుతూ అధ్యయన ఫలితాలు తనను ఆశ్చర్యపరచలేదన్నారు. 'రోజూ చేసే వంట పనిని కలిసి పని చేయడం వల్ల పురుషుల కన్నా మహిళలు సంతోషిస్తారు. కలిసి పనిచేయడం వ్లల వారిద్దరిమధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. యువతరం ఈ నూతన ఆలోచనను స్వాగతిస్తోంద'ని ఆమె పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 30 October, 2009
|