వణికిస్తున్న 'స్పెక్ట్రమ్'
ఈ ఆఫీసర్ల కార్యాలయాలపైనే కాకుండా ఎల్ఒఐలు అందుకున్న అన్ని ప్రైవేట్ సంస్థలపై కూడా సిబిఐ దాడులు నిర్వహించింది. ఆ సంస్థలలో యూనిటెక్ వైర్ లెస్, స్వాన్, సిస్టమా, ఎస్-టెల్, లూప్, డేటాకామ్ కూడా ఉన్నాయి. సమగ్రంగా ప్రశ్నించే నిమిత్తం ఆ సంస్థలకు చెందిన పలువురు ఉన్నత స్థాయి అధికారులను కూడా సిబిఐ పిలిపించింది.
స్పెక్ట్రమ్ కేటాయింపులో ప్రమేయం ఉన్న డిఒటి, డబ్ల్యుపిసి, ప్రైవేట్ సంస్థలు, కన్సల్టెంట్లు వంటి వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు మిక్కుటంగా ఉన్నట్లు సిబిఐ భావిస్తున్నదని సిబిఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రిటైరైన డిఒటి అధికారులు కొందరిని కూడా సిబిఐ ప్రశ్నించగలదని తెలుస్తున్నది.
2జి స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ట్రాయ్ సిఫార్సులు చేయవలసి వచ్చిన పరిస్థితులు, తన సిఫార్సులలో నుంచి ఆచితూచి ఎంపికలు జరిపిందంటూ ప్రభుత్వంపై ట్రాయ్ బహిరంగంగా విరుచుకుపడిన వివాదానికి సంబంధించిన పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవడానికి ట్రాయ్ ను సిబిఐ సంప్రదించవచ్చునని భావిస్తున్నారు.
సాక్ష్యాధారాలను సేకరించడానికి, అధికారులను ప్రశ్నించడానికి ఇతర ప్రాంతాలలో దాడులు జరిపే నిమిత్తం సిబిఐ పలు బృందాలను పంపింది. 'ఈ సాక్ష్యాధారాలతో ఏమి చేయాలనేది నిర్ణయించుకోవలసింది ప్రభుత్వమే. అయితే, ఇంత కూలంకషంగా, పకడ్బందీగా దర్యాప్తు జరిపిన తరువాత ఈ అక్రమాలను సుదీర్ఘ కాలం ప్రభుత్వం గోప్యంగా ఉంచే అవకాశం లేదు' అని ఆ వర్గాలు సూచించాయి.
Pages: -1- 2 News Posted: 31 October, 2009
|