ధనికుల జాబితాలో జగన్
క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ క్రితం సంవత్సరం రూ. 8 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కోటిన్నర రూపాయలు చెల్లించారు. మహేంద్ర సింగ్ ధోని రెండవ స్థానంలో ఉన్నారు. ధోని గత సంవత్సరం రూ. 4.6 కోట్ల మేరకు, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు రూ. 2 కోట్ల మేరకు పన్ను చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పన్ను విషయంలో మాస్ట్రో సచిన్ ను ధోని మించిపోయే అవకాశం ఉంది.
పన్ను చెల్లింపుదారులలో జగన్ తరువాత అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది క్రికెట్ నిర్వాహకుడు లలిత్ మోడి. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ (భజ్జీ), వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖ క్రికెటర్లను కూడా లలిత్ మోడి వెనుకకు నెట్టివేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మోడి ఇప్పటికే రూ. 8 కోట్ల మేరకు పన్ను చెల్లించారు. ఇది ధోని చెల్లించిన మొత్తానికి నాలుగింతలు, సచిన్ టెండూల్కర్ చెల్లించిన మొత్తానికి ఐదింతలు పైగా ఉంది. ఈ సందర్భంగా మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే లలిత్ మోడి 2008-09 సంవత్సరం మొత్తానికి కలిపి రూ. 32 లక్షలు మాత్రమే పన్ను చెల్లించడం.
టాప్ టాక్స్ పేయర్ ప్రముఖులలో అగ్ర స్థానంలో బాలీవుడ్ తారలు ఉన్నారు. వారిలో షారుఖ్ ఖాన్ (ఎస్ఆర్ కె) క్రితం సంవత్సరం రూ. 34.45 కోట్లు చెల్లించి అగ్ర తాంబూలం అందుకున్నారు. అక్షయ్ కుమార్ రూ. 33 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. అయితే, ఈ సంవత్సరం ఎస్ఆర్ కెను అక్షయ్ దాటిపోవచ్చు. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎస్ఆర్ కె రూ. 3.5 కోట్లు మాత్రమే చెల్లించగా అక్షయ్ రూ. 4.5 కోట్లు చెల్లించారు. అడ్వాన్స్ పన్ను చెల్లింపును సూచికగా తీసుకుంటే వారి ఆదాయం ఈ సంవత్సరం రూ. 30 కోట్లు, రూ. 50 కోట్లు మధ్య ఉండవచ్చు. కెరీర్ ఊర్థ్వ ముఖంలో ఉన్నరణబీర్ కపూర్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.
Pages: -1- 2 -3- News Posted: 31 October, 2009
|