ధనికుల జాబితాలో జగన్
ఇద్దరు సూపర్ స్ఠార్లు షారుఖ్, అక్షయ్ తరువాత స్థానాలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లవి. క్రితం సంవత్సరం సల్మాన్ రూ. 14 కోట్లు, హృతిక్ రోషన్ రూ. 14 కోట్లు చెల్లించారు. అయితే, ఈ సంవత్సరం తొలి ఆరు మాసాలలో హృతిక్ రూ. 3.5 కోట్ల మేరకు అడ్వాన్స్ పన్ను చెల్లించారు. సల్మాన్ రూ. 2.5 కోట్లు మాత్రమే అడ్వాన్స్ పన్ను చెల్లించారు. అంటే ఈ సంవత్సరం సల్మాన్ కన్నా హృతిక్ ఆదాయం ఎక్కువగా ఉండవచ్చన్నమాట. కాని ఐదవ స్థానంలో ఉన్న ఆమీర్ ఖాన్ వారిద్దరి కన్నా ఎక్కువ ఆదాయం రావచ్చని సూచిస్తూ ఈ సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 3.5 కోట్లు అడ్వాన్స్ పన్నుగా చెల్లించారు. ఇది షారుఖ్ చెల్లించిన మొత్తానికి సమానం. ఆమీర్ క్రితం సంవత్సరం రూ. 11.32 కోట్ల మేరకు పన్ను చెల్లించారు.
ఈ ప్రముఖ టాక్స్ పేయర్ల జాబితాలో చోటు చేసుకున్న బాలీవుడ్ తారలు ఎనిమిది మందిలో సైఫ్ అలీఖాన్, ఐశ్వర్యారాయ్, రణబీర్ చివరి స్థానాలలో ఉన్నారు. సైఫ్ క్రితం సంవత్సరం రూ. 8.6 కోట్ల మేరకు పన్ను చెల్లించగా ఐశ్వర్య చెల్లించిన మొత్తం రూ. 4.8 కోట్లు. వీరిద్దరు ఈ సంవత్సరం ఒకే మొత్తం ఆదాయం సూచిస్తున్నారు. కొత్త నటుడు రణబీర్ క్రితం సంవత్సరం రూ. 1.8 కోట్ల మేరకు పన్ను చెల్లించారు. 2010 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రణబీర్ సూచిస్తున్న ఆదాయం ఐష్, సైఫ్ లకు దరిదాపుల్లో ఉన్నది.
ఆసక్తికరమైన విషయమేమంటే ఈ ప్రముఖులు ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి బయటపడకపోవడం. క్రితం సంవత్సరం మొదటి ఆరు నెలలలో చెల్లించిన అడ్వాన్స్ పన్నును బట్టి వీరు సూచించిన మొత్తం ఆదాయం కన్నా ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా ఉండవచ్చు. క్రితం సంవత్సరం ప్రథమార్ధంలో ఎస్ఆర్ కె రూ. 15 కోట్లు చెల్లించగా ఈ సంవత్సరం అదే కాలంలో రూ. 3.5 కోట్లు మాత్రమే చెల్లించారు. అక్షయ్ క్రితం సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 8 కోట్లు చెల్లించగా ఈ సంవత్సరం అదే కాలంలో చెల్లించిన అడ్వాన్స్ పన్ను 4.5 కోట్ల రూపాయలుగా ఉంది.
Pages: -1- -2- 3 News Posted: 31 October, 2009
|