అతడు.. ఆమె.. విడాకులు!
తనకు విడాకులు చాలా నెలల క్రితమే ఇచ్చారని తెలిసి భర్త లేదా భార్య దిగ్భ్రాంతి చెందిన సందర్భాలు పెక్కింటిని న్యాయవాదులు ఉటంకిస్తున్నారు. 'గతంలో పరస్పర అనుమతి ఉండవలసిన విడాకుల కేసులలో వేరే వ్యక్తులను చూపించిన సందర్భాలు ఉన్నాయి. కాని కోర్టు కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ దంపతుల పెళ్ళి ఫోటోలు, ఇతర గుర్తింపు పత్రాలు సమర్పించాలని అడగసాగింది' అని సీనియర్ న్యాయవాది ఎస్. వాణి చెప్పారు. గతంలో రెంట్ కంట్రోల్ కేసులలో మాత్రమే జనం ఇటువంటి తప్పుడు పద్ధతులకు (మరొకరి చిరునామాకు సమన్లు అందేలా చూడడానికి) అలవాటు పడేవారు. కాని ఇప్పుడు కుటుంబ వ్యవహారాలలో కూడా ఇది జరుగుతోంది' అని వాణి చెప్పారు. 'చాలా కేసులలో దంపతులు ఒకే ఇంటిలో నివసిస్తుంటారు. కాని తన భార్య తన పుట్టింటికి వెళ్ళిన సమయం చూసుకుని సమన్లు ఇంటికి చేరేలా భర్త జాగ్రత్త పడుతున్నాడు' అని వాణి వివరించారు.
కాగా, ఎక్స్ పార్టీ విడాకుల విషయంలో కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని భాస్కర్ బెన్నీ వంటి న్యాయవాదులు సూచిస్తున్నారు. 'సమన్లను జీవిత భాగస్వామి మాత్రమే అందుకోవాలి. ఒక సాక్షి దీనిని ధ్రువీకరించాలి' అని ఆయన సూచించారు.
Pages: -1- 2 News Posted: 2 November, 2009
|