ఈజీగానే క్రేజీ 'పిల్' అత్యవసర గర్భనిరోధక మాత్రలను గురించి మండలికి గత సెప్టెంబర్ లో ఫిర్యాదు అందింది. మీడియాలో విపరీతంగా జరుగుతున్న ప్రచారం వలన యువత పెడదారులు తొక్కే అవకాశం ఉందని, వారిలో అనారోగ్య ఆలోచలు తలెత్తుతున్నాయని వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరించారు. అంతేకాక అరక్షిత శృంగారానికి యువతను ప్రేరేపిస్తుందని, దానివలన ఎయిడ్స్ మహమ్మారి వాపిస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మాత్రను గురించి టెలివిజన్లలో కంపెనీలు చేస్తున్న ప్రచారం ఇదేదో రోజూ వాడే గర్భనిరోధక ఔషధం అన్నభావనను కలిగించే విధంగా ఉన్నాయని, ఎప్పుడో అత్యవసరంగా మాత్రమే వాడాలనే హెచ్చరిక ఈ ప్రచారంలో లేదని కూడా వారు వివరించారు. సంవత్సరం క్రితం ఈ ఔషధం అమ్మకాలుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి మహిళలు ఈ మాత్రను ఎంచుకునే హక్కు ఉందన్న విధంగానే ప్రచారం సాగిపోయింది.
కానీ ఈ మందును ఇష్టానుసారం వాడకుండా చూడటానికి కంపెనీలు తమ ప్రకటనల్లో మార్పులు చేయాలని మాత్రం సూచించింది. దీనికోసం ఒక కమిటీని వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో ఇద్దరు ప్రసూతి వైద్య నిపుణులు, భారత ప్రసూతి నిపుణుల సంఘాల సమాఖ్య నుంచి ఒక సభ్యుడు, కేంద్ర సమాచార పౌరసంబంధ శాఖ అధికారి, ఒక ఔషధనిపుణుడు సభ్యులుగా ఉంటారని, ఈ కమిటీ ప్రకటనలను పరిశీలిస్తాయని వివరించారు. ప్రచారం కోసం రూపొందించే ప్రకటనలకు కమిటీ మార్గదర్శక సూత్రాలను సూచించాలన్నారు. కానీ దానికి ఎలాంటి గడువూ పెట్టలేదు.
Pages: -1- 2 News Posted: 10 November, 2009
|