పెచ్చరిల్లుతున్న మరణవాంఛ 'ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల భావోద్వేగానికి గురైనప్పుడు, మానసిక సమస్యలు తలెత్తినప్పుడు వ్యక్తులకు అండగా ఉండేవారు కరవవుతున్నారు' అని మానసిక ఆరోగ్య విషయాల సలహాదారు నీరా జైన్ తెలిపారు. 'ఏటా ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' అని అంతర్జాతీయ ఆత్మహత్యల నిరోధక సంస్థ (ఐఎఎస్ పి) అధ్యక్షుడు బ్రియాన్ మిషారా తెలియజేశారు. 60 శాతం ఆత్మహత్యలు ఇప్పుడు ఆసియాలోనే సంభవిస్తున్నాయని, ఇందులో చైనా, ఇండియా, జపాన్ వాటా 40 శాతమని మిషారా తెలిపారు.
'మానసిక ఆరోగ్య సమస్యలను సకాలంలో పరిష్కరించడం, ఆరోగ్యకరమైన జీవన సరళిని అనుసరించడం వంటి బహుముఖ వ్యూహాన్ని ఈ విషయంలో అనుసరించవచ్చు' అని ఫోర్టిస్ ఆసుపత్రిలో సైకియాట్రి, సైకోథెరపీ విభాగం అధిపతి డాక్టర్ సమీర్ మల్హోత్రా సూచించారు.
బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్య, న్యూరోసైన్సెస్ ఇన్ స్టిట్యూట్ (నిమ్హాన్స్)లో సైకియాట్రి విభాగం అధిపతి ఎస్.కె. చతుర్వేది ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'తమ సమస్యలను మాతో చెప్పుకునేట్లుగా, తమ అభిప్రాయాలను మాతో పంచుకునేట్లుగా మేము రోగులను ప్రోత్సహిస్తాం. ఎవరైనా ఆత్మహత్యకు పూనుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని మేము గ్రహించినట్లయితే మేము వారిని ఆసుపత్రిలో చేర్చుకుంటాం' అని తెలియజేశారు. భావోద్వేగపూరిత, సెక్స్ సంబంధిత, సామాజిక సమస్యలతో రోజూ సుమారు 500 మంది నిమ్హాన్స్ కు వస్తుంటారని ఆయన తెలిపారు. ఈ తరహా మరణాన్ని ఎవరైనా నివారించడమనేది అత్యంత కష్టమని కచ్చితంగా చెప్పవచ్చు.
Pages: -1- 2 News Posted: 10 November, 2009
|