భారత్ తొలి మ్యాచ్ బంగ్లాతో
టోర్నమెంట్ పోటీల కార్యక్రమాన్ని సోమవారం ముంబైలో విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాత్ కుదించిన ఫార్మాట్, జట్ల సంఖ్య తగ్గింపు వల్ల వీక్షకులలో ఆసక్తి పెరగగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత టోర్నమెంట్ మరీ సుదీర్ఘ కాలం సాగిందని, బోర్ కొట్టిందనే విమర్శలు వచ్చిన సంగతి విదితమే. 'ఈ టోర్నమెంట్ ను 14 జట్లకు కుదించాం. క్రితం సారి కన్నా రెండు జట్లు తక్కువ. టోర్నమెంట్ వ్యవధిని కూడా ఒక వారం మేర తగ్గించడమైనది' అని లోర్గాత్ తెలియజేశారు.
ఐసిసి ఉపాధ్యక్షుడు, 2011 ప్రపంచ కప్ కేంద్ర నిర్వాహక కమిటీ (సిఒసి) చైర్మన్ శరద్ పవార్ మాట్లాడుతూ, అన్ని వేదికలలో క్రీడాకారులకు, వీక్షకులకు, మీడియాకు అగ్ర శ్రేణి సదుపాయాలు లభించగలవని హామీ ఇచ్చారు. '2011 ప్రపంచ కప్ కోసం ఇండియాలో అన్ని స్టేడియాలను సిద్ధం చేయడానికి మేము రూ. 50 కోట్లు కేటాయించాం. ప్రపంచ కప్ నిర్వహణకు ఇండియా సిద్ధంగా ఉందని మీకు భరోసా ఇస్తున్నాను. వాంఖెడే స్టేడియాన్ని నిర్మించి పోటీలకు సకాలంలో సిద్ధం చేస్తాం' అని ఆయన చెప్పారు.
కాగా దేశంలో ప్రపంచ కప్ టోర్నీ జరగడం ఇది మూడవ పర్యాయం. 1987 ప్రపంచ కప్ ను ఇండియా ఒక్కటే నిర్వహించిన తరువాత 1996 ప్రపంచ కప్ టోర్నీకి పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా సహ ఆతిథ్య దేశాలుగా ఉన్నాయి.
పాకిస్తాన్ తన గ్రూప్ పోటీలన్నిటినీ శ్రీలంకలోనే ఆడుతుంది. అయితే, ఏప్రిల్ 2న ముంబై వాంఖెడే స్టేడియంలో జరిగే ఫైనల్ కు పాక్ జట్టు అర్హత పొందినట్లయితే, వారికి భారతీయ అభిమానులు ఆనందంగా స్వాగతం పలకగలరని పవార్ చెప్పారు.
Pages: -1- 2 -3- News Posted: 10 November, 2009
|