భారత్ తొలి మ్యాచ్ బంగ్లాతో
ఇండియాలో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 20న చెన్నైలో న్యూజిలాండ్, కెన్యా జట్ల మధ్య జరుగుతుంది. స్వదేశీ అభిమానుల సమక్షంలో ఇండియా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 27న కోలకతాలో ఇంగ్లండ్ తో ఆడుతుంది. ఇండియా తన ఇతర పోటీలను మార్చి 6న బెంగళూరులో ఐర్లాండ్ తోను, 9న న్యూఢిల్లీలోనెదర్లాండ్స్ తోను, 12న నాగపూర్ లో దక్షిణాఫ్రికాతోను, 20న చెన్నైలో వెస్టిండీస్ తోను ఆడుతుంది.
ప్రతి గ్రూప్ లో మొదటి నాలుగు స్థానాలు పొందిన జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటాయి. క్వార్టర్ ఫైనల్స్ మార్చి 23, 25 తేదీలలో ఢాకాలోను, మార్చి 24న కొలంబోలోను, మార్చి 26న అహ్మదాబాద్ లోను జరుగుతాయి.
రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు మార్చి 29న కొలంబోలోను, 30న మొహాలిలోను జరుగుతాయి. ప్రధానమైన ఫైనల్ పోటీ ఏప్రిల్ 2న ముంబై వాంఖెడే స్టేడియంలో జరుగుతుంది.
టోర్నీకి గ్రూపింగ్ లు : గ్రూప్ 'ఎ' : ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే, కెనడా, కెన్యా.
గ్రూప్ 'బి' : ఇండియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్.
Pages: -1- -2- 3 News Posted: 10 November, 2009
|