వారసుని వేటలో టాటా
వారసుడు భారత జాతీయుడైతే సులువుగానే ఉంటుందని, కానీ ప్రస్తుతం టాటా కు వచ్చే ఆదాయంలో 65 శాతం విదేశాల నుంచే ఉందని ఆయన వివరించారు. ఆ హోదాలో కూర్చునే వ్యక్తి ఈ విషయానికి న్యాయం చేసే నేర్పరి అయివుండాలని రతన్ చెప్పారు. 98 కంపెనీలు టాటా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సంవత్సరానికి దాదాపు మూడు లక్షల 55 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాగిస్తోంది. మూడ లక్షల 57 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1868 లో అవతరించిన టాటా గ్రూపు దేశంలో అతిపెద్ద మోటారు వాహనాల తయారీదారుగా ఉంది. పెద్ద సాప్ట్ వేర్ కంపెనీగా, ప్రైవేట్ వ్యవస్థలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉంది. అలానే ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే టాటా స్టీల్ ఎనిమిదో స్థానంలో ఉంది.
అంతర్జాతీయ విస్తరణకు రతన్ టాటాయే శ్రీకారం చుట్టారు. 2007 లో టాటా స్టీల్ ఆంగ్లో-డచ్ ఉక్కుకంపెనీ కోరస్ ను 65 వేల కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది. 2008లో టాటా మోటర్స్ సుమారు 11500 కోట్ల రూపాయలతో జాగ్వార్ లాండ్ రోవర్ ను స్వాధీనం చేసుకుంది. మరిన్ని విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూపు విస్తరణకు ఇంకా సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. అయితే ఆర్ధిక మాంద్యం కారణంగా ఈ ప్రక్రియ కష్టాల్లో పడిందన్నారు. పరిస్థితులు కంపెనీ ఖర్చును తగ్గించేదిశగా నడిపించాయన్నారు. కష్టకాలంలో కూడా టాటా మోటార్స్ దాదాపు 15 వేల కోట్ల రూపాయల అప్పులను తీర్చిందని ఆయన అన్నారు. ఆ లక్ష్యసాధన ఎంత కష్టమైందో చాలామందికి తెలియదని ఆయన చెప్పారు.
Pages: -1- 2 News Posted: 18 November, 2009
|