వెబ్ సైట్లలో లింగ నిర్ధారణ అయితే, పోర్టల్స్ ప్రతినిధులు ఇండియాలో ఇటువంటి సదుపాయాలపై ప్రకటనను మాత్రమే చట్టం నిషేధిస్తున్నదని వాదిస్తున్నారు. వాటి గురించి రాయడంపై నిషేధం ఏదీ లేనందున సెర్చ్ ఫలితాలను పర్యవేక్షించజాలమని, ఎందుకంటే విద్య సంబంధిత సమాచారాన్ని అది అడ్డుకోవచ్చునని వారంటున్నారు. గూగుల్ అడ్వర్టైజింగ్ విధానం ప్రకారం 'ఇండియాలో ప్రకటనలను పొందుపరిచేటప్పుడు ప్రసూతికి ముందు లింగ నిర్థారణను లేదా గర్భధారణకు ముందే సెక్స్ ఎంపికను ప్రోత్సహించేందుకు వాణిజ్య ప్రకటనలను అనుమతించడంది లేదు'. కాని ఇతర దేశాలలో క్లినిక్ ల ప్రకటనలకు గూగుల్ సెర్చ్ పోర్టల్ అవకాశం కల్పిస్తున్నది.
'ఇండియాలో ప్రసూతికి ముందు లింగ నిర్థారణను లేదా గర్భధారణకు ముందు సెక్స్ ఎంపికను ప్రోత్సహించే ప్రకటనలను మేము అనుమతించం' అని గూగుల్ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 'యాహూ! ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నది. సంబంధిత స్థానిక చట్టాలకు, నిబంధనలకు ఇది కట్టుబడి ఉంటున్నది' అని సంస్థ అధికార ప్రతినిధి తెలియజేశారు. కాగా, 'ఈ పోర్టల్స్ ఇండియాలో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇందుకు డబ్బు వసూలు చేస్తున్నాయి' అని ఒక ఎన్ జిఓ సంస్థ నాయకుడు సాబూ జార్జి ఆరోపించారు.
Pages: -1- 2 News Posted: 21 November, 2009
|