ముద్దుకు మీసం అడ్డు!
దేశవ్యాప్తంగా సుమారు 36 శాతం మంది పురుషులు మీసంతో ఉంటారు. మీసం, గడ్డం ఉండడం పాత ఫ్యాషన్ అని 27 మంది మహిళలు భావిస్తున్నట్లు దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా పురుషులు, మహిళలపై నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎసి నీల్సన్ నిర్వహించిన సర్వే ప్రకారం, ఇతర నగరాలలోని పురుషుల కన్నా ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలలో అధిక శాతం మంది పూర్తిగా షేవింగ్ చేసుకుని కనిపిస్తారు. ముంబైలో వీరిది 72 శాతం కాగా, ఢిల్లీలో 82 శాతం, అహ్మదాబాద్ లో 79 శాతం మంది ఈ కోవలోకి వస్తారు. అయితే, చెన్నైలో 56 శాతం మంది పురుషులు మీసంతో ఉంటారు. దేశంలోని పట్టణ ప్రాంతాలలో పూర్తిగా షేవ్ చేసుకోవడానికి ఎక్కువగా చెప్పే కారణం 'మొహం శుభ్రంగా కనిపిస్తుంది' అని. కాని చెన్నై, బెంగళూరు నగరాలలో పురుషులు 'ఇలా బాగుంటుంది' అని కారణం చెప్పారు.
తరచు షేవ్ చేసుకునేవారికి అందుకు కారణాలు లేకపోలేదు. ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ నగరాలలో పురుషులు వయస్సు తక్కువగా కనిపించేందుకు షేవ్ చేసుకుంటుంటారు. లక్నో, పాట్నాలలో పురుషులు 'మంచి ఆరోగ్యం' కోసం అలా చేస్తుంటామని చెప్పారు. కాని గుజరాతీలు, తమిళులు 'తోటి వారితో సమంగా కనిపించేందుకు' అలా చేస్తుంటారు.
సగటు షేవింగ్ వ్యవధి ఆరు నిమిషాలు, పావు గంట మద్య ఉంటుంది. చెన్నై, బెంగళూరులలో పురుషులు అందరికన్నా నెమ్మదిగా షేవ్ చేసుకుంటారు. వారు ఇందుకు కనీసం అర గంట తీసుకుంటారు. లక్నోలో పురుషులు ఐదు నిమిషాలు ఇంకా తక్కువ వ్యవధిలో షేవ్ చేసుకుంటారు. అహ్మదాబాద్, బెంగళూరు నగరాలలో పురుషులు స్వయంగా షేవ్ చేసుకుంటారు. కాని ముంబై, కోలకతా నగరాలలో మెజారిటీ పురుషులు ఆ పని స్వయంగా చేసుకోరు.
ఇండియాలో 90 శాతం మంది పూర్తిగా షేవ్ చేసుకోవడాన్ని ఇష్టపడతారు కాని వాస్తవానికి 55 శాతం మంది అలా చేస్తారు. భారతదేశంలో అధిక సంఖ్యాక మహిళలు తమ పురుషులు పూర్తిగా షేవ్ చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నా ఇలా జరగడం విశేషం. కాగా భారతదేశంలో పురుషులు వారానికి మూడు సార్ల కన్నా తక్కువగా షేవింగ్ చేసుకుంటుంటారు. కొరియా, జపాన్ పురుషులతో పోలిస్తే ఇది బాగా తక్కువ.
Pages: -1- 2 News Posted: 25 November, 2009
|