దుబాయ్ నీరో మక్తూమ్ తన 12 ఏళ్ళ వయస్సులో మొదటిసారిగా గుర్రం పందెంలో పాల్గొన్న, స్కూలుకు వెళుతూ తన గుర్రంతో పాటే ఉదయం అల్పాహారం తీసుకునేవాడైన దుబాయి పాలకుడు 1970 దశకంలో రేసింగ్ తో ప్రమేయం కల్పించుకున్నారు. 1966లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఒక ఇంగ్లీష్ కుటుంబంతో కలసి నివసించినప్పుడు ఆయను ఈ క్రీడపై ఆసక్తి పెంచుకున్నారని ఆయన రేసింగ్ స్టేబుల్ 'గోడోల్ఫిన్' వెబ్ సైట్ తెలియజేసింది. లండన్ కు చెందిన 'టైమ్స్' పత్రికలో ఇటీవల ప్రచురితమైన వార్త ప్రకారం,ఈ క్రీడ చరిత్రలోనే షేక్ మహమ్మద్ ను మించిన రేసు గుర్రాల యజమాని, పెంపకందారుడు లేరు. ఆయనవి దాదాపు 700 రేసు గుర్రాలు శిక్షణలో ఉన్నాయి.
1977లో ఇంగ్లండ్ లోని బ్రైటన్ లో తన గుర్రం 'హట్టా'తో తన మొదటి రేసును గెలుచుకున్నప్పటి నుంచి ఆయన తన కార్యకలాపాలను ఒక్క న్యూమార్కెట్ లోనే 7000 ఎకరాల ఆశ్వికశాలలకు, 5000 ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి విస్తరించారు. దుబాయి పాలకునికి ఐర్లాండ్, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియాలలో మొత్తం 12 వేల ఎకరాల భూములు ఉన్నాయి.
ఒక రేసు గుర్రానికి తర్ఫీదు ఇవ్వడానికి సగటున ఏడాదికి 33,169 డాలర్లు ఖర్చు అవుతుంది. ఆయన గోడోల్ఫిన్ రేసింగ్ స్టేబుల్ ఒక్క ఈ సంవత్సరమే 20 మిలియన్ డాలర్లకు పైగై నగదు బహుమతిని గెలుచుకున్నదని, 1992లో ప్రారంభించినప్పుడు గెలుచుకున్న నగదు బహుమతి 3,642 డాలర్లని వెబ్ సైట్ తెలియజేసింది. విజయాల పరంగా ఈ స్టేబుల్ నుంచి వచ్చిన అత్యధిక విజయాల గుర్రాలలో దుబాయి మిలేనియం, హాలింగ్, కేయిఫ్ తార ఉన్నాయి. ఈ మూడూ ఒక్కొక్కటీ తొమ్మిది రేసులను గెలుచుకున్నాయి. అయినప్పటికీ ఆయన పెట్టుబడి పెట్టిన మొత్తాల కన్నా వచ్చే రాబడి తక్కువే.
ఫెర్గూసన్ కొనుగోలు చేసిన 141 గుర్రాలు జూన్ 5 వరకు ఉత్తర గోళంలో రేసులలో నగదు బహుమతి రూపంలో సగటున 48,689 డాలర్లను ఆర్జించాయి. ఒక్కొక్క గుర్రానికి షేక్ చెల్లించిన సగటు ధర 1.03 మిలియన్ డాలర్లలో అది 4.7 శాతం మాత్రమే. 18 మంది భారీ కొనుగోలుదారులు మొదట్లో పెట్టిన పెట్టుబడిలో సగటున 32.4 శాతంలో ఆరింట ఒక వంతు కన్నా ఇది తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా తన గుర్రాల పెంపకం, రేసింగ్ కార్యకలాపాలపై షేక్ మహమ్మద్ తన సొంత నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారని ఫెర్గూసన్ తెలిపారు. దుబాయిలో సంక్షోభంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ఫెర్గూసన్ న్యూమార్కెట్ లో వేలం కేంద్రం నుంచి నిష్క్రమిస్తూ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 3 December, 2009
|