'ఒకే ఒక్కడు' సెహ్వాగ్ ఏ దేశంలోనైనా, ఏ మైదానంలోనైనా అతను రాణించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక. అతని అరంగేట్రం చేసిన సెంచరీ దక్షిణాఫ్రికాలోని సీమ్ బౌలింగ్ స్వర్గధామమైన బ్లొయిమ్ ఫోంటీన్ లో చేసాడు. అరవీర భయంకరులైన పేసర్లు షాన్ పోలాక్, నాంటీ హేవర్డ్, జాక్ కల్లీస్, లాన్స్ క్లూస్నర్, మఖయ నితిని లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. గత యేడాది శ్రీలంకలో మిస్టరీ స్లో బౌలర్ అజంతా మెండీస్ కు నలుగురు బలైపోతే సెహ్వాగ్ ఒక్కడే నిలబడ్డాడు.
2002-03లో న్యూజిలాండ్ లో మనం దారుణంగా సాగిన వన్డే సీరిస్ ను గుర్తు చేసుకోండి. అప్పుడు కూడా సెహ్వాగ్ రెండు సెంచరీలు చేసి రెండు మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించాడు. భయంకర వేగంతో వచ్చే బంతులకు ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ, టెండుల్కర్ నలుగురూ కలిసి మొత్తం సీరీస్ లో 215 పరుగులను 10.75 సరాసరితో చేశారు. ఏ ఒక్కరూ ఏప్పడూ 25 పరుగుల మార్కును దాటలేకపోయారు. టెండూల్కర్ అయితే మూడు ఇన్నింగ్స్ లోనూ కలిపి రెండు పరుగులు చేసి ఒక పరుగు సరాసరి సాధించాడు. కానీ సెహ్వాగ్ 42.71 సరాసరితో మొత్తం 299 పరుగులు చేశాడు. సీరీస్ అన్ని మ్యాచ్ ల్లో కలిపి జట్టు 916 పరుగులు చేస్తే అందులో మూడో వంతు పరుగులు సెహ్వాగ్ చేసినవే.
ఇలాంటి మైలు రాళ్లు ఎన్నో సెహ్వాగ్ అలవోకగా దాటేశాడు. కానీ మన దేశంలో హంగుకు, ఆర్భటానికి, ప్రచారానికి ఇచ్చే ప్రాముఖ్యం నిజమైన సహజసిద్ధమైన ప్రతిభకు ఇవ్వలేం. నాజూకుగా, పుస్తకాల్లో క్రికెట్ ఆడే వాళ్లను చూస్తే మనకు వెర్రి వ్యామోహం. అందకే సెహ్వాగ్ ను ప్రపంచంలోనే మేటి బ్యాట్స్ మన్ అని పొగడలేం. అభిమానించలేం. గౌరవించలేం. కానీ దాని వల్ల అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు.
Pages: -1- -2- 3 News Posted: 3 December, 2009
|