'అంబానీలూ రాజీకి రండి'
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి బాలకృష్ణన్, న్యాయమూర్తులు బి. సుదర్శన్ రెడ్డి, పి. సదాశివంలతో కూడిన ధర్మాసనం ముందు వాదించిన సొలిసిటర్ జనరల్ ఎన్ టిపిసికి ఆర్ఐఎల్ యూనిట్ కు 2.34 డాలర్లకు తప్పనిసరిగా గ్యాస్ సరఫరా చేసే విషయమై విద్యుత్ (ఎంఒపి), పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ (ఎంఒపిఎన్ జి)ల మధ్య గల విభేదాల గురించి ప్రస్తావన ఏదీ చేయలేదు. 'ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ టిపిసి హక్కుల పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం' అని ఆయన చెప్పారు.
'దావాపై హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ లేదా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పరిస్థితిని బట్టి ఎన్ టిపిసి ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం సానుకూల చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ (ఆర్ఐఎల్ తో) ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్ట్ (పిఎస్ సి) క్లాజుల కింద ప్రభుత్వానికి తగినన్ని అధికారాలు ఉన్నాయి' అని ఆయన తెలిపారు. ఆ ఇద్దరు సోదరుల మధ్య గల ప్రైవేటే దావాలో పిఎస్ సిపై భాష్యం చెప్పకుండా కోర్టు మిన్నకుండాలని, ఎందుకంటే ఆర్ఐఎల్ తో, 200 పైచిలుకు ఇతర సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న 41 పిఎస్ సిలపై దాని ప్రభావం పడవచ్చునని గోపాల్ సుబ్రహ్మణ్యం అన్నారు.
ఆర్ఎన్ఆర్ఎల్ తరఫు న్యాయవాది రామ్ జెఠ్మలానీ ప్రభుత్వ అఫిడవిట్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ, ఆర్ఐఎల్ మధ్య గల అపవిత్ర పొత్తును అది ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు. విద్యుత్ మంత్రిత్వశాఖ అజమాయిషీలో గల ఎన్ టిపిసి తరఫున మాట్లాడేందుకు పెట్రోలియం శాఖ మంత్రికి ఎటువంటి అధికారమూ లేదని స్పష్టం చేస్తూ జెఠ్మలానీ ప్రభుత్వ అఫిడవిట్ ను తప్పుపట్టారు.
Pages: -1- 2 News Posted: 4 December, 2009
|