తల్లి కావాలనుకుని...? పునీత్ కు తనకు పుట్టిన బిడ్డేనని ఆమె తన భర్తతో చెప్పిందని, తాను 'గర్భవతి'గా ఉన్న సమయంలో మందుల కొనుగోలుకు అతని వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండేదని దర్యాప్తు సిబ్బంది తెలిపారు. అయితే, ఆమె భర్తను ఇంకా నిర్బంధంలోకి తీసుకోనప్పటికీ అతనిని కూడా విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సంతానం పొందలేకపోయానన్న 'సామాజిక అపప్రథ'కు గురి కావడం వల్లే అతను ఈ విషయంలో ఆమెకు చేదోడు అయి ఉండవచ్చునని వారంటున్నారు.
తాను పునీత్ ను ఇంటికి తీసుకువచ్చిన వెంటనే మరొకసారి గర్భం దాల్చవలసిందని తన భర్త పట్టుబట్టినట్లు, అందుకే తాను మరొక శిశువును కిడ్నాప్ చేసినట్లు రీతూ పోలీసులకు ఇచ్చిన వాఙ్మూలంలో తెలియజేసింది. ఆమె ఒక నెల బాలుని అపహరించింది. కాని అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె అతనిని వదలివేసింది. తరువాత 19 రోజుల శిశువును ఆమె కిడ్నాప్ చేసింది. కాని ఈ శిశువు 'ఎప్పుడూ అస్వస్థుడు'గా ఉంటున్నందున, తాను 'వీడిని సాకలేనని భావించినందున' ఇతనిని కూడా ఆమె వదలివేసింది. ఇది ఇలా ఉండగా, ఆమె మానసిక స్థితిని అంచనా వేయడానికి ఒక సైక్రియాటిస్ట్ సాయం తీసుకోవాలని తాము యోచిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలియజేశాయి.
Pages: -1- 2 News Posted: 8 December, 2009
|