ఇప్పుడు టాటాల 'స్వచ్ఛ్'
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), టాటా కెమికల్స్, టైటన్ ఇండస్ట్రీస్ సంస్థలు నాలుగు సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి రూపకల్పన చేసిన పరికరమే టాటా స్వచ్ఛ్. సాఫ్ట్ వేర్ సంస్థ టిసిఎస్ నానోటెక్నాలజీని తీసుకురాగా టాట కెమికల్స్ ధాన్యం ఊక బుడిద వంటి తక్కువ ఖరీదు ముడిపదార్థాలను ఉపయోగించే విధానాన్ని అభివృద్ధి చేసింది. టైటన్ సంస్థ తయారీ ప్రక్రియను రూపొందించింది. వెయ్యి రూపాయల లోపు ధర ఉండే ఈ పరికరం విశిష్టత ఏమిటంటే దీనికి విద్యుచ్ఛక్తి అవసరం అసలే లేకపోవడం. గ్రామీణ భారతానికి విద్యుత్ సరఫరా కూడా ఒక సవాలే కదా!
'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) డిసెంబర్ 7 సంచికలో తన 'వాట్స్ అప్' కాలంలో నీటి విభాగంలో టాటా గ్రూప్ ఆలోచనల గురించి ముందుగా సమాచారం అందజేసింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయమేమంట్, షాపూర్జీ పాలోన్జీ గ్రూప్ యాజమాన్యంలోని యురేకా ఫోర్బ్స్ సంస్థ ఉత్పత్తి, ఖరీదైన 'అక్వగ్వార్డ్'తో టాటా స్వచ్ఛ్ పోటీ పడడం. ఈ గ్రూపు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్లో ఏకైక పెద్ద వాటాదారుగా ఉన్నది. హెచ్ యుఎల్ కు చెందిన 'ప్యూరిట్', ఫిలిప్స్ వంటి బహుళ జాతి సంస్థల (ఎంఎన్ సిల) నుంచి, కొన్ని దేశీ బ్రాండ్ల నుంచి టాటా స్వచ్ఛ్ కు గట్టి పోటీ ఎదురుకావచ్చు.
ఈ పరికరాన్ని తొలుత మూడు రాష్ట్రాలు - మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలో ప్రవేశపెడతారు. తొలి సంవత్సరంలో పది లక్షల యూనిట్లు అమ్మగలమని సంస్థ ఆశిస్తున్నది. విదేశీ మార్కెట్లలోకి ప్రవేశించే తక్షణ ఆలోచనలు ఈ గ్రూపునకు లేకపోయినప్పటికీ ఆఫ్రికా ఖండం అవసరాలను తీర్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 8 December, 2009
|