దత్తత మరింత తేలిక కాగా లా కమిషన్ మెంబర్ కీర్తి సింగ్ ఈ ప్రతిపాదిత సవరణలు స్వాగతించదగినవేనని అన్నారు. అయితే, ఈ చట్టాలను పూర్తిగా క్షాళన చేయవలసిన అవసరం ఉందని కీర్తి సింగ్ సూచించారు.
దత్తత చట్టాలను సవరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన పట్ల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ (ఎన్ జిఒ)లు హర్షం వెలిబుచ్చాయి. అయితే, ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని అవి సలహా ఇచ్చాయి. 'ఇది సకారాత్మక చర్య. పోషణ, రక్షణ అవసరమైన పిల్లల విషయంలో చట్టాలు మార్పులకు వీలుగా ఉండాలి. అయితే, ఇది దుర్వినియోగం కాకుండా చూడడానికి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి' అని ప్రతిధి సంస్థకు చెందిన రాజ్ మంగళ్ ప్రసాద్ పేర్కొన్నారు.
బటర్ ఫ్లైస్ అనే ఎన్ జిఒ సంస్థకు చెందిన జెర్రీ పింటో ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎవరూ శ్రద్ధ తీసుకోని సంస్థలకు ప్రస్తుతం పరిమితమైన అనాథ పిల్లల దత్తతకు ఈ ప్రతిపాదిత సవరణలు మరిన్ని అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 'అయితే, మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు పోషించే రెండు ప్రధాన పాత్రల మధ్య సమతూకాన్ని మీరు ఎలా సాధిస్తారు? తల్లిదండ్రులలో ఒకరే పిల్లలతో నివసిస్తున్న కేసులు ఎన్నో ఉన్నాయి. అయితే, ఇది అసాధారణ పరిస్థితి. పిల్లలకు ఆరోగ్యకరమైనది కాదు. తమ జీవిత భాగస్వామి అందుబాటులో లేని లోటును తీర్చేందుకు తల్లిదండ్రులు తగిన ఏర్పాట్లు చేయాలి' అని జెర్రీ పింటో అన్నారు.
Pages: -1- 2 News Posted: 16 December, 2009
|