పిల్లల ఎక్సేంజ్ ఆఫర్! ఇద్దరు ఆడపిల్లలను పెంచిన తరువాత కుమారుని కోసం తాను తపించానని, కాని తాను మరొక ఆడశిశువును ప్రసవించానని తెలుసుకుని కుంగిపోయానని తంగం పోలీసులతో చెప్పింది. తన పక్క బెడ్ పైనే ఉన్న అమ్ముతో స్నేహం చేశానని, ఆమెకు కుమారుడు ఉన్నాడని, కాని ఆమె కుమార్తెను కోరుకుంటున్నదని తెలుసుకున్నానని తంగం వివరించింది. తంగం ఒక ఆడపిల్లకు, అమ్ము ఒక పిల్లవానికి జన్మ ఇచ్చిన కొన్ని రోజులకు తమను పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు తరలించినప్పుడు ఆ మహిళలు ఇద్దరూ శిశువుల మార్పిడికి అంగీకారానికి వచ్చారు.
పోలీసులు ఆ ఇద్దరు శిశువులను వారివారి తల్లులకు అప్పగించారు. వారిద్దరిపై అభియోగాలను నమోదు చేయవలసి ఉన్నప్పటికీ కేసు పెట్టకుండానే వారిద్దరినీ పోలీసులు వదలివేశారు. 'నేను కుమారుని కోసం ప్రార్థించాను, కాని అలా జరగలేదు. నేను తప్పు చేశానని నాకు తెలుసు. కాని దురుద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు' అని తంగం చెప్పింది.
Pages: -1- 2 News Posted: 25 December, 2009
|