'ఆత్మహత్య' కట్టుకథలు ఈ కేసులకు అసలైన కారణం గృహ హింస, విఫలమైన వైవాహిక సంబంధాల నుంచి ఆర్థికపరమైన, విద్యా విషయకమైన వైఫల్యం వరకు ఏదైనా కావచ్చునని న్యాయవాదులు అంటున్నారు. 'చాలా కేసులలో యువతి తల్లిదండ్రులు కూడా ఎదురుతిరుగుతున్నారు. కేసు దాఖలు చేయడానికి నిరాకరిస్తున్నారు. కడుపు నొప్పి కారణంగా అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలు ఆంధ్ర ప్రదేశ్ లోనే జరుగుతున్నాయి' అని సీనియర్ న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు చెప్పారు.
ఈ ఆత్మహత్య కేసులలో 95 శాతానికి కారణాలు బోగస్ వని తెలిసినప్పటికీ పోలీసులు ఆవిషయంగా దర్యాప్తులో ముందుకు సాగలేరు. 'కొద్ది మంది మహిళలు కడుపు నొప్పి లేదా తిమ్మిరులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంటారు. అయితే, తల్లిదండ్రులు, బంధువులు ఈ కారణాన్ని పేర్కొంటూ కేసు మూసివేస్తుంటే మేము ఇక చేసేదేమి ఉంటుంది. మాకు ఏదైనా అనుమానం కలిగితేనే మేము కేసులను చేపట్టుతుంటాం' అని వెస్ట్ జోన్ డిసిపి రవి వర్మ చెప్పారు.
వాస్తవాలు:
* 'కడుపు నొప్పి'ని ఒక కారణంగా పేర్కొంటూ ప్రతి నెల పది మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
* ఈ కేసులలో 5 శాతం మాత్రమే సిసలైనవి. 95 శాతం కేసులలో వాస్తవాన్ని దాచిపెట్టడానికి కడుపు నొప్పిని ఒక సాకుగా చూపుతుంటారు.
* పలు కేసులలో పోలీసులు మెట్టినింటివారితో కుమ్మక్కు అవుతుంటారు.
* గృహ హింస కేసులను కప్పిపుచ్చుకోవడానికి తలనొప్పి, మైగ్రెయిన్, మానసిక వ్యథను కారణాలుగా తరచు చెబుతుంటారు.
Pages: -1- 2 News Posted: 28 December, 2009
|