నానో ధర పెరగదు
'వచ్చే సంవత్సరం మార్చి నాటికి, లేదా ఆ తరువాత తమ నానో కార్లు రావచ్చునని అనుకుంటున్నవారు చాలా మంది బుకింగ్ లను రద్దు చేసుకుంటున్నారు' అని న్యూఢిల్లీ రఘువంశి ఎంటర్ ప్రైజెస్ ప్రొప్రైటర్ కృష్ణ బన్సల్ చెప్పారు. 'జనం నిరీక్షించవలసిన అగత్యం లేని ఇతర కొత్త కార్లు మార్కెట్ లో ఉన్నాయి' అని ఎ1 మోటార్స్ సంస్థ డీలర్ చెప్పారు. 'తమకు కారు వెంటనే లభ్యమయ్యేటట్లయితే ఎక్కువ చెల్లించడానికైనా జనం వెనుకాడరు' అని ఆయన తెలిపారు.
బుకింగ్ లను కస్టమర్లు కొందరు రద్దు చేసుకోవడం అసాధారణమేమీ కాదని టాటా మోటార్స్ సంస్థ పేర్కొన్నది. 'పంత్ నగర్ లోని మా ప్లాంట్ లో ఉత్పాదక సామర్థ్యం పరిమితమైనది. అయితే, 2010 చివరి త్రైమాసికం లోగా లక్ష కార్లను బట్వాడా చేయాలని మా ఆలోచన' అని టాటా మోటార్స్ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే, ఎంత మంది రద్దు చేసుకున్నదీ కచ్చితంగా చెప్పడానికి ఆయన నిరాకరించారు.
Pages: -1- 2 News Posted: 28 December, 2009
|