పిల్ల పోయి జైలు వచ్చే.. ఆ తరువాత చెల్లించవలసిన డబ్బు గురించి, అది అందజేయవలసిన ప్రదేశం గురించి తిరిగి డిమాండ్ వచ్చింది. కాని ఇది అపరిచిత వ్యక్తి నుంచి వర్మ సెల్ ఫోన్ కు మెస్సేజ్ ల రూపంలో వచ్చింది. 'మేము ఎస్ఎంఎస్ ల ద్వారా సమాధానాలు పంపడం ప్రారంభించి, ఐఎంఇఐ నంబర్ (ప్రతి హాండ్ సెట్ కు నిర్దేశించే ప్రత్యేక కోడ్) ద్వారా మొబైల్ జాడ పసిగట్టాం. తొలుత అతని ఇంటి సమీపంలో ఒక చోట డబ్బును ఉంచాలని వారు కోరారు. వర్మ అదే విధంగా చేశారు. కాని వెంటనే నల్ల బ్యాగ్ లో ఉంచిన డబ్బుతో ఇంటికి తిరిగి వెళ్ళవలసిందని కోరారు. బహుశా ఆ యువకులకు అనుమానం వేసి ఉండాలి' అని పోలీస్ అధికారి వివరించారు.
అటుపిమ్మట డబ్బు అందజేయవలసిన ప్రదేశాలను మార్చారు. చివరకు డిసెంబర్ 27న వర్మ మరొక కుమారుడు పునీత్ ను ఒక మాల్ సమీపంలో ఎవరూ సంచరించని ఒక ప్రదేశంలో ఆ బ్యాగ్ ను వదలి వెళ్ళాలని కోరారు. పోలీసులు మాటు వేసి ఉండగా, పునీత్ బ్యాగ్ ను అక్కడ వదలి, తన వాహనంలో తిరిగి వెళుతుండగా, తలను కప్పి ఉంచి ఒక బ్లాక్ జాకెట్ ను ధరించిన పొడగరి మనిషి ఆ బ్యాగ్ ను తీసుకోవడానికి వచ్చాడు. అతను మరెవరో కాదు. సాక్షాత్తు పవనే.
Pages: -1- 2 News Posted: 29 December, 2009
|