ఫైవ్ స్టార్ డీలా
సాధారణంగా ఇటువంటి హోటళ్లలో పార్టీలు సాగే తీరుకు ఇది పూర్తిగా భిన్నం. డిసెంబర్ నెలాఖరుకు ఇటువంటి పార్టీలకు డబ్బు చెల్లించేందుకు సిద్ధపడినప్పటికీ పాస్ సంపాదించడం గగనకుసుమంగా ఉంటుండేది. కాని ఈసారి పరిస్థితి అలా లేదు. తమ పార్టీలను రద్దు చేసుకునే పరిస్థితి రాదనే హోటళ్లు ఆశిస్తున్నాయి.
'విద్యార్థుల ఆదేశం కారణంగా ఈ పార్టీలను రద్దు చేసినట్లయితే హోటళ్లకు భారీగా నష్టం వాటిల్లుతుంది' అని ఐటిసి వెల్కమ్ గ్రూప్ లో భాగమైన ఫార్చ్యూన్ సెలెక్ట్ మనోహర్ హోటల్ ఏరియా జనరల్ మేనేజర్ రామ్ మిశ్రా చెప్పారు. 'నూతన సంవత్సరం వేడుకల వల్ల అత్యధికంగా ఆదాయం సమకూరుతుంటుంది. ఎందుకంటే అన్ని హోటళ్లు గరిష్ఠ స్థాయిలో ఆహార, పానీయాల అమ్మకాలు సాగిస్తుంటాయి. ఇప్పటి వరకు మా హోటల్ లో కొత్త సంవత్సరం వేడుకల కోసం జరిగిన బుకింగ్ లు అంత ప్రోత్సాహకరంగా లేవు. అమ్మకాలు బాగా మందకొడిగా సాగుతున్నాయి' అని ఆయన తెలిపారు.
కొత్త సంవత్సర స్వాగత సంరంభానికి విద్యార్థులను అడ్డుపడనివ్వబోమని హోటల్ యాజమాన్యాలకు నగర పోలీసు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ జనం తమ ఇళ్లలో నుంచి బయటకు రారని హోటలియర్లు అభిప్రాయపడుతున్నారు. 'కొత్త సంవత్సరం వేడుకల కోసం అన్ని హోటళ్లు భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ హోటల్ వెలుపల వల్ల అంతగా ప్రయోజనం ఉండదు' అని రాష్ట్ర హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం కార్యదర్శి ప్రదీప్ దత్ అన్నారు. 'హోటల్ నుంచి బయటకు వచ్చిన తరువాత తమ వాహనాలకు నష్టం కలిగించవచ్చు లేదా దౌర్జన్యం జరగవచ్చు కనుక జనం ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. అన్ని హోటళ్లు డోలాయమానంలో పడ్డాయి' అని మిశ్రా పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 30 December, 2009
|