అమ్మకాల రేసులో కార్లు
ఇక మహీంద్ర అండ్ మహీంద్ర (ఎంఅండ్ఎం), జనరల్ మోటార్స్ (జిఎం) సంస్థలకు డిసెంబర్ నూరు శాతం పైగా వృద్ధి నమోదైన మాసం. జిఎం కార్ల అమ్మకాలు 104 శాతం మేర పెరిగాయి. ఈ సంస్థ 2008 డిసెంబర్ 4041 కార్లను అమ్మగా ఈ సంఖ్య 2009 డిసెంబర్ లో 8258కి పెరిగింది. ఈ సంస్థ దేశంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభించిన తరువాత ఒక నెలలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం ఇదే. ఈ సంస్థ డిసెంబర్ లో 4147 షెవర్లె స్పార్క్ మినీ కార్లు, 616 కొత్త సెడాన్ క్రూజ్ కార్లు, 859 షెవర్లె బీట్ కార్లను విక్రయించింది. 'వినియోగదారులలో ఆశలు క్రమంగా తిరిగి పెరుగుతుండడంతో జిఎం ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేయగలగాలి' అని సంస్థ పేర్కొన్నది.
ఎంఅండ్ఎం సంస్థకు చెందిన స్కార్పియో, గ్జైలో, బొలేరో, పికప్ లు వంటి బహుళ ఉపయోగ వాహనాల అమ్మకాలు 120 శాతం మేర పెరిగాయి. ఈ సంస్థ 2008 డిసెంబర్ లో 7726 వాహనాలను విక్రయించగా 2009 డిసెంబర్ లో ఈ సంఖ్య 16999కి పెరిగింది. ఇక ద్విచక్ర వాహనాల రంగంలో హీరో హోండా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సంస్థ 74 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఈ సంస్థ 2008 డిసెంబర్ లో 2.15 లక్షల వాహనాలను అమ్మగా ఈ సంఖ్య 2009 డిసెంబర్ లో 3.75 లక్షలకు పెరిగింది. దేశంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సంస్థలలో మూడవ స్థానంలో ఉన్న టివిఎస్ 1.02 లక్షల వాహనాలను విక్రయించింది. 2008 డిసెంబర్ లోని అమ్మకాల సంఖ్య 72355 కన్నా ఇది 42 శాతం అధికం.
లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ స్కోడా ఆటో క్రితం సంవత్సరం డిసెంబర్ లో తన అమ్మకాల 52 శాతం మేర పెరిగాయని వెల్లడించింది. అంతకుముందు సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ సంస్థ 732 కార్లను విక్రయించగా క్రితం సంవత్సరం ఇదే నెలలో విక్రయాలు 1113కు పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటుండడంతో ఈ సంవత్సరం అమ్మకాలు ఇంకా అధికం కాగలవని సంస్థ ఆశిస్తున్నది.
ఆర్థిక వ్యవస్థ 2010లో సుమారు 7.5 శాతం, 8 శాతం మధ్య వృద్ధి చెందగలదని ఆశిస్తున్నందున కొత్త మోడల్ కార్ల రంగ ప్రవేశంతో ఈ సంవత్సరం కార్ల అమ్మకాలు మరింతగా పెరగగలవని ఆటోమోబైల్ రంగం నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడుతున్నందున, 2010లో అవి పుంజుకోగలవని భావిస్తున్నందున ఎగుమతి మార్కెట్ల పునరుద్ధరణ జరగవచ్చునని వారు సూచించారు. ఉద్దీపన ప్యాకేజీ కొనసాగింపు ఇందుకు మరింత దోహదం చేస్తుంది.
Pages: -1- 2 News Posted: 2 January, 2010
|