సొంత రైల్వే స్టేషన్ 'గుర్గాఁవ్, ఢిల్లీ, రేవారిలకు వెళ్ళవలసిన అవసరం ఉన్న గ్రామస్థులు అనేక మంది ఉన్నారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఉన్నారు. ఇప్పటి వరకు మేము రైలు ఎక్కాలంటే హయిలిమండి లేదా పట్లికి వెళ్లవలసి వస్తున్నది. ఆ రెండు స్టేషన్లూ తాజ్ నగర్ కు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. గ్రామం మీదుగా రైలు మార్గం వెళుతున్నప్పుడు ఇక్కడ స్టేషన్ ఉండాలని మేము భావించాం. మేము 1982 నుంచి ఈ అభ్యర్థన చేస్తూనే ఉన్నాం. కాని తమ వద్ద నిధులు లేవని రైల్వే శాఖ చెపుతున్నది. అందువల్ల ఇక మా అవసరం మేమే తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాం' అని కమిటీ సభ్యుడు హుకుమ్ చంద్ వివరించారు.
తాము సొంత వనరులతో స్టేషన్ ను నిర్మించుకున్నట్లయితే స్టేషన్ లో కొన్ని రైళ్లనైనా ఆపిస్తారా అని గ్రామస్థులు ఆతరువాత రైల్వే శాఖను అడిగారు. తమ ప్రమాణాల ప్రకారం స్టేషన్ ను నిర్మించినట్లయితే రెండు వైపుల ఏడు ప్యాసింజర్ రైళ్లను ఆపించేందుకు రైల్వే శాఖ అంగీకరించడం వారికి ఆశ్చర్యం కలిగించింది.
'అనేక మంది దీని వల్ల ప్రయోజనం పొందుతారు కనుక దీనిన హాల్ట్ స్టేషన్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఆర్థికంగా ఇది లాయకీయేనని అనిపించింది' అని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి అనంత్ స్వరూప్ తెలియజేశారు. ఒక స్టేషన్ మాస్టర్ ను, టిక్కెట్ కలెక్టర్ ను నియమించినట్లు ఆయన వెల్లడించారు. ఈ స్టేషన్ పూర్తి కావడానికి ఏడాది పట్టింది. స్టేషన్ లో రెండు ప్లాట్ ఫారాలు ఉన్నాయి. కచ్చా ప్లాట్ ఫారమ్, నీరు, విద్యుత్ సౌకర్యాలు, టిక్కెట్ కౌంటర్ ఉన్నాయి. గుర్గాఁవ్ ఎంపి రావు ఇంద్రజీత్ సింగ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేస్తున్నారు. కాంక్రీట్ ప్లాట్ ఫారమ్, వెయిటింగ్ రూమ్, ఓవర్ హెడ్ షెడ్ ఏర్పాటుకు రైల్వే శాఖ తమకు చేయూత ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Pages: -1- 2 News Posted: 5 January, 2010
|