స్మోకింగ్ మానితే షుగర్? అసలు ఎన్నడూ పొగతాగనివారితో పోలిస్తే ధూమపానానికి స్వస్తి చెప్పినవారు సిగరెట్లు తాగకుండా గడిపిన మొదటి ఆరు సంవత్సరాలలో 'టైప్ 2' చక్కెర వ్యాధికి గురయ్యే ప్రమాదం 70 శాతం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు. ధూమపానానికి స్వస్తి చెప్పిన తరువాత మొదటి మూడేళ్లలో ఈ రిస్క్ అధికంగా ఉంది. పదేళ్ల తరువాత ఇది మామూలు స్థితికి వచ్చింది.
ఆ సమయంలో ధూమపానం కొనసాగించిన వ్యక్తులలో ఈ రిస్క్ తక్కువగా ఉంది. కాని అసలెన్నడూ పొగతాగని వారితో పోలిస్తే ఈ వ్యక్తులు చక్కెర వ్యాధికి గురయ్యే అవకాశం ఇంకా 30 శాతం ఎక్కువగానే ఉంది.1987 నుంచి 1989 వరకు చక్కెర వ్యాధికి ఇంకా గురి కాని 10892 మంది మధ్యవయస్కులపై ఈ అధ్యయనం నిర్వహించారు. రోగుల స్థితిగతులను 17 ఏళ్ల వరకు నిశితంగా పరిశీలించారు. చక్కెర స్థాయి, గ్లూకోజ్ స్థాయి, బరువు వంటి డేటాను మధ్యమధ్యలో సేకరించారు.
ఈ అధ్యయనం ప్రకారం, విపరీతంగా ధూమపానం చేసినవారు, బాగా ఎక్కువగా బరువు పెరిగినవారు ధూమపానానికి స్వస్తి చెప్పిన తరువాత చక్కెర వ్యాధికి గురయ్యే అవకాశం అధికంగా ఉందని తేలింది. ఈ అధ్యయనం నిర్వహించిన మొదటి మూడేళ్లలో ధూమపానం మానివేసినవారు సగటున 8.4 పౌండ్ల బరువు పెరిగారు. వారి నడుము చుట్టుకొలత సుమారు 1.25 అంగుళాలు పెరిగింది.
Pages: -1- 2 News Posted: 5 January, 2010
|