రైల్వేకూలీలుగా గ్రాడ్యుయేట్లు కాగా, దరఖాస్తులలో అనేకం గ్రాడ్యుయేట్ల నుంచి రావడం రైల్వే శాఖకు ఆశ్చర్యం కలిగించడం లేదు. 'ఈ పోర్టర్లలో అధిక సంఖ్యాకులు యూనియన్ నిర్దేశించిన రేట్లకు బద్ధులు కారు. అదనపు చార్జీలు వసూలు చేస్తుంటారు. పైగా ఎప్పటికప్పుడు పదోన్నతులు పొందుతుంటారు' అని అనిల్ సింగ్ చెప్పారు. పోర్టర్లకు రైల్వే గ్యాంగ్ మన్ లుగా పదోన్నతి కల్పించే పథకం ఒకదానిని రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టారు. 'పోర్టర్ గా ఉద్యోగం సంపాదించిన తరువాత వారు గ్యాంగ్ మన్ ఉద్యోగం కోసం చూస్తుంటారు. దరఖాస్తుదారులందరికీ ఇదే ప్రధాన ఆకర్షణ' అని సింగ్ పేర్కొన్నారు.
అయితే, చాలా మంది అభ్యర్థులు మరీ కఠినమైన ప్రక్రియ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'మమ్మల్ని వీపుపై 40 కిలోల బరువుతో 40 సెకన్లలో 200 మీటర్ల దూరం పరుగెత్తవలసిందని కోరుతున్నారు. ఇది అసాధ్యమైన పని' అని గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారుడు సాగర్ పేర్కొన్నాడు. కాని, ఇది అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 12 January, 2010
|