ట్రెజరీ షేర్లు అమ్మిన రిల్
'అప్పు చేయడం కన్నా ఈక్విటీని సంస్థ ఉపయోగించుకుంటున్నది' అని హాంకాంగ్ కు చెందిన సాన్ ఫర్డ్ సి బెర్న్ స్టెయిన్ అండ్ కో సంస్థ అనలిస్ట్ నీల్ బెవెరిడ్జ్ 'బ్లూమ్ బెర్గ్'తో అన్నారు. ఆర్ఐఎల్ ఇంతవరకు షేర్ల అమ్మకం ద్వారా సమీకరించిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆర్జించిన రూ. 7158 కోట్ల నికర లాభం కన్నా ఎక్కువే. సంస్థ షేర్లను సోమవారం ఐదు సంస్థలకు విక్రయించినట్లు ఈ సంస్థ వాటాల అమ్మకం ఏజెన్సీ ముంబైలోని యుబిఎస్ ఎజిలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీషా గిరోత్రా 'బ్లూమ్ బెర్గ్'కు తెలియజేశారు. అయితే, ఆ సంస్థల పేర్ల వెల్లడికి గిరోత్రా నిరాకరించారు.
ఈ షేర్ల అమ్మకం ప్రభావం ఆర్ఐఎల్ బ్యాలెన్స్ షీటుపై సకారాత్మకంగానే ఉంటుందని, అయితే, ఒకసారి లాభంగా ఇది ప్రతిబింబిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సుమారు 7 బిలియన్ డాలర్ల విలువ మేరకు సోమవారం విక్రయం అనంతరం రిలయన్స్ వద్ద ఇటువంటి షేర్లు దాదాపు 310 మిలియన్లు ఉన్నాయి. సంస్థ తన బిడ్ ను 13.5 బిలియన్ డాలర్ల నుంచి మరింతగా సవరించుకుంటే పూర్తి సంవత్సరపు ఆర్థిక లాభాలను చేరుకోవచ్చునని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో రీసర్చ్ విభాగం అధిపతి అంబరీష్ బాలిగా అభిప్రాయం వెలిబుచ్చారు. రిలయన్స్ సంస్థ ప్రస్తుతపు 'బిఎఎ2' రేటింగ్ పైన, 'సుస్థిరత'పైన ఈ ట్రెజరీ షేర్ల అమ్మకం ప్రభావం వెంటనే పడదని మూడీస్ సంస్థ కూడా వ్యాఖ్యానించింది.
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్ - రిల్) ఈ నెలలో రెండవ సారి రూ. 2465 కోట్లు సమీకరించేందుకై సుమారు 33 మిలియన్ల ట్రెజరీ షేర్లను సోమవారం విక్రయించింది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అత్యంత భారీ సంస్థ అయిన ఆర్ఐఎల్ అత్యవసర మదుపు కోసం కచ్చితంగా నగదును సిద్ధం చేసుకుంటున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. లయండెల్ బాసెల్ ఆఫర్ ధర చెల్లించేందుకు లేదా ఇతర కొనుగోళ్ల కోసం నిధులను సంస్థ సమీకరిస్తున్నది.
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇవాన్ పలాషియోస్ అభిప్రాయం ప్రకారం, ఆర్ఐఎల్ వద్ద సోమవారం వాటాల అమ్మకం అనంతరం దాదాపు 6.5 బిలియన్ డాలర్లు విలువ చేసే ట్రెజరీ షేర్లు,సుమారు 4.5 బిలియన్ డాలర్ల నగదు ఉన్నాయి. ఈ షేర్లను ఒక్కొక్కటి రూ. 1050 రేటుకు అమ్మారు. జనవరి 8 నాటి ముగింపు ధర కన్నా ఇది 4.8 శాతం తక్కువ.
Pages: -1- 2 -3- News Posted: 12 January, 2010
|