నవ యువకులు...90 ఏళ్ళే అయితే, అగర్వాల్ ఒకప్పుడు ఉన్న శరీర దారుఢ్యంతో (ఫిట్ గా) ఇప్పుడు లేరు. కాని కోలకతా వాసులకు సహజమైన 'కొలెస్టరాల్, చక్కెర, ఒత్తిడి' రుగ్మతలు ఆయన దరిని ఇంకా చేరలేదు. మరి ఇంత సుదీర్ఘ జీవితంలో ఆయనకు అత్యంత ఆనందం కలిగించే విషయాలేవి? తన ముని మనవలు, మనవరాళ్ళతో గడపడాన్ని మించిన ఆనందం ఆయనకు మరొకటి లేదు. 'నా పెద్ద ముని మనవని వయస్సు 20 ఏళ్లు, అందరి కన్నా చిన్నవాడు కొన్ని రోజుల క్రితమే పుట్టాడు' అని అగర్వాల్ చెప్పారు.
మరి అంత వృద్ధులు అలా జీవితం సాగించడానికి ఏది దోహదం చేస్తోంది? 'పిన్న వయస్సులో ఆరోగ్యకరమైన జీవితం' అని కన్సల్టెంట్ వృద్ధాప్య చికిత్సా నిపుణుడు (జెరియాట్రీషియన్) పి.కె. పూవైయా సమాధానం ఇచ్చారు. ఆయన ఎఎంఆర్ఐ ఆసుపత్రిలో జ్యోతి బసుకు చికిత్స చేస్తున్న వైద్యుల బృందంలో ఒక సభ్యుడు. 'శరీర బరువును నియంత్రించుకోవడం, ధూమపానం చేయకపోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం వంటి సాధారణ ప్రక్రియలే శరీరాన్ని సుదీర్ఘ కాలం దృఢంగా ఉంచుతాయి' అని పూవైయా చెప్పారు. 'రోజు వారీ పనుల నిర్వహణకు తన మనస్సు, శరీరం తగినవిగా ఉన్నాయని ఏ మనిషైనా భావించినంత కాలం అతను చాలా ఆరోగ్యంగా ఉంటాడు' అని ఆయన పేర్కొన్నారు.
దేవవ్రత ఘోష్ దస్తీదార్ ఎంతో కులాసాగా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ముగ్గురు మునిమనవలు, ముని మనవరాళ్లు ఉన్న ఆయనకు ఇప్పటికీ ఎవరి సాయమూ అక్కరలేదు. 'జ్యోతిబాబు నా కన్నా రెండు నెలలు చిన్న' అని 95 ఏళ్ల దస్తీదార్ చెప్పారు. ఆయన రక్షణ మంత్రిత్వశాఖ (తుపాకులు, మందుగుండు సామగ్ర విభాగం)లో 32 ఏళ్ల పాటు పని చేశారు.
'82 ఏళ్ల వయస్సులో నేను ఒక్కడినే కెనడా వెళ్లాను. 83 ఏళ్ల వయస్సులో నేను కోల్ కతా యూనియన్ బ్రిడ్జి క్లబ్ లో బ్రిడ్జి ఆడేందుకు బస్సులో వెళుతుండేవాడిని' అని ఆయన టీ కప్పు అందుకుంటూ గర్వంగా చెప్పారు. టీ కప్పు అందుకుంటున్నప్పుడు ఆయన వేళ్లు వణకలేదు. ఆయన ఆహారం మితంగానే ఉంటుంది. కాని ఒక విషయంలో మాత్రం ఆయన మితం పాటించరు. 'రాత్రి భోజనం తరువాత రసగుల్లా లేదా సందేశ్ తింటుంటాను' అని ఆయన పళ్లు బయటపడేలా నవ్వుతూ చెప్పారు. ఆయనకు కృత్రిమ దంతాలు లేవు.
Pages: -1- 2 News Posted: 15 January, 2010
|