విమాన చార్జీల్లో స్పష్టత
కస్టమర్ల సౌకర్యార్థం తాము చార్జీలను వేరు చేస్తున్నామని విమాన సంస్థలు చెపుతుండగా విమాన సంస్థ నుంచి తమకు ఏ వివరాలు అందితే వాటినే తాము చూపిస్తున్నామని పోర్టల్స్ పేర్కొంటున్నాయి. 'మేము ఒకే చార్జీని పేర్కొనడం ప్రారంభించాం. కాని వేటికి ఎంత చార్జీ అంటూ వివరాల కోసం మాకు ప్రశ్నలు అనేకం రాసాగాయి. దానితో మేము విడివిడిగా చార్జీలను తిరిగి పేర్కొనసాగాం. అయితే, డిజిసిఎ సర్వోన్నత అధికార సంస్థ కనుక అది మమ్మల్ని కోరిన పక్షంలో పూర్వపు పద్ధతిని మేము తిరిగి అనుసరిస్తాం' అని ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్ 'మేక్ మైట్రిప్ డాట్ కామ్'లో ఆన్ లైన్ సేల్స్ విభాగం అధిపతి మొహిత్ శ్రీవాత్సవ తెలియజేశారు.
'విమాన సంస్థల నుంచి మాకు అందే సమాచారాన్నే మేము పేర్కొంటున్నాం. అంతేకాకుండా ప్రయాణికులకు తెలిసే విధంగా ఇంధన సర్చార్జిని సూచించాలని మాకు సిఫార్సు చేశారు. ఈ చార్జీని ప్రభుత్వం కాకుండా విమాన సంస్థ వసూలు చేస్తుంటుంది. జరుగుతున్నది ఇదే' అని మరొక ట్రావెల్ పోర్టల్ 'యాత్ర డాట్ కామ్' వ్యవస్థాపక జనరల్ మేనేజర్ (ఎయిర్ లైన్స్ బిజినెస్ గ్రూప్) భావనా అగర్వాల్ వివరించారు. దేశంలో విక్రయించే విమాన టిక్కెట్లలో సుమారు 60 శాతం ఆన్ లైన్ లోనే బుక్ అవుతుంటాయి.
Pages: -1- 2 News Posted: 18 January, 2010
|