స్వర్ణం 'మెరుపు' తగ్గింది
బంగారం కొంత 'మెరుగు'ను కోల్పోయినప్పటికీ స్థూల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళనల వల్ల బంగారం ఇప్పటికీ 'రిస్క్'కు విరుగుడుగా ఉపయోగపడుతున్నదని పరిశ్రమ అధికారులు, పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో బంగారంపై పెట్టుబడికి ఇతోధిక అవకాశాలు ఉంటాయని వారు భావిస్తున్నారు.
'ద్రవ్యోల్బణానికి సంబంధించి ఇంకా ఆందోళన ఉంటుండడంతోను, 2009లో మార్కెట్లు శీఘ్రగతిని వృద్ధి చెందడంతోను బంగారం ఇటిఎఫ్ లలో ఆసక్తి ఇంకా ఎక్కువగానే ఉంది' అని హెచ్ డిఎఫ్ సి సెక్యూరిటీస్ సంస్థకు చెందిన అనుపమ్ గుప్తా పేర్కొన్నారు. 'బంగారం చాలా వేగంగా పుంజుకుంది. అయితే, బంగారం విషయంలో భారీ స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని మేము ఊహించడం లేదు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి అవకాశమే' అని కొటక్ మహీంద్ర సంస్థకు చెందిన లక్ష్మీ అయ్యర్ పేర్కొన్నారు. డిమాండ్ పెరగనారంభించినందున బంగారం ధరలు 1050 డాలర్లు, 1070 డాలర్ల మధ్య లాభదాయక స్థాయిలో ఉన్నాయని ఆమె చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్నందున పెట్టుబడి ఆప్షన్ గా బంగారానికి పెరుగుతున్న డిమాండ్ వల్ల బంగారం ఇటిఎఫ్ లు కూడా లబ్ధి పొందగలవని పరిశీలకులు సూచిస్తున్నారు.
కాగా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మదుపుదారులు తమ కార్పస్ లో కనీసం పది శాతాన్ని బంగారంలోను, బంగారం సంబంధిత ప్రాడక్టులలోను మదుపు చేయాలని ఫండ్ మేనేజర్లు సూచిస్తున్నారు. బంగారం ధరలు 25 శాతం మేర పెరిగిన నేపథ్యంలో ఆరు బంగారం ఇటిఎఫ్ ల నిర్వహణ కింద అసెట్లు 2009లో రెట్టింపు అయ్యి రూ. 1300 కోట్లకు చేరుకున్నాయి.
Pages: -1- 2 News Posted: 26 January, 2010
|