ధీటుగా దేశీయ సెల్ ఫోన్లు
అలాగే ఢ్లిల్లీ కేంద్రంగా ఉత్పత్తి సాగిస్తున్న మరో దేశీయ మోబైల్ కంపెనీ ఇంటెక్స్ కూడా మార్కెట్ లో భారీస్థాయిలోనే విక్రయాలు సాగిస్తోంది. తేలికైన ఫోన్ లు రూపొందించడం, అత్యాధునిక మోడళ్లను అందుబాటులోకి తేవడం, వాటర్ రెసిస్టెన్స్ సౌలభ్యం, 45 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ గల ఫోన్ లను ఉప్పెనలా మార్కెట్లోకి ఈ కంపెనీ తెచ్చిపెట్టింది. టచ్ స్క్రీన్, 5 ఎల్ ఇ డి టచ్, ఎంఎస్సెన్ మెసెంజర్ లైవ్, మొబైల్ సెక్యూరిటీ వంటి సౌలభ్యాలతో ఫోన్లను రూపొందించింది. IN 3070, IN4488, IN 4455, IN 5050(GSM-CDMA) వంటి ఫోన్ లను ఈ సంస్థ రెండు వేల నుండి ఎనిమిది వేల రూపాయలకే విక్రయిస్తోంది.
ఆలాగే కేవలం తొమ్మిది నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన కర్బాన్ కంపెనీ ఇప్పటికే దాదాపు 25 మోడళ్ల వరుకు రూపొందించి విక్రయాలు సాగిస్తోంది. అత్యాధునాతన ఫీచర్ లతో తయారు చేసిన k 445, k446, k447, k770 వంటి మోడళ్ల ఫోన్లలో మ్యూజిక్ ప్లేయర్, డ్యుయల్ సిమ్, టచ్ స్క్రీన్ వంటి సౌలభ్యాల గల ఈ మోడళ్లు ఇతర కంపెనీలతో పోల్చుకుంటే తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. ఢిల్లీకి చెందిన జైనా గ్రూప్ తో కలసి దేశవ్యాప్తంగా 15 ప్రత్యేక స్టోర్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే ఈ ఏడాది చివరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది.
పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దేశీయ మొబైల్ విక్రయాల్లో అతి పెద్ద షేర్ ఉన్న ఉషా శ్రీరామ్ గ్రూప్ తన కార్యకలాపాలను ఇకపై గుజరాత్ కూడా విస్తరించాలని నిర్ణయించింది. ఉషా లెక్సస్ పేరిట మొబైల్స్ విక్రయిస్తున్న ఈ సంస్థ 2003 లోనే దేశీయ ఫోన్ లను రూపొందించి అమ్మకాలు సాగించింది.ఎంఎంఎస్, కెమెరా, బయో రిథమ్, వీడియో కెమెరా, బ్లూటూత్ వంటి ఫీచర్ లు ఉన్న ఫోన్ లను ఈ సంస్థ 3, 500 రూపాయలకే అమ్మకం చేస్తోంది. ఈ సంస్థ తయారు చేసిన F సిరీస్ మోడల్ ఫోన్ కు విశేష ఆదరణ లభించింది.
ఒనిడా కంపెనీ ప్రవేశపెట్టిన వి- సిరీస్ ఫోన్ అతితక్కువ ధర కాగా, ఐ- సిరీస్ పేరిట రూపొందించిన ఫోన్ ను అత్యధిక ధరకు విక్రయిస్తోంది. ఈ సంస్థ 1700లకు పోన్ల ధర ప్రారంభమవుతోంది.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో విశేష ఖ్యాతినార్జించిన వీడియోకాన్ కూడూ గత ఏడాది మొబైల్ హ్యాండ్ సెట్ ల తయారీ రంగంలోకి ప్రవేశించింది. 1400- 15000 రూపాయల మధ్య దాదాపు 12 మోడళ్లను ప్రవేశపెట్టింది. v-1750 పేరిట టచ్ స్క్రీన్ ఫోన్ ను, v-1760 పేరిట డ్యూయల్ సిమ్ మోయల్ ఫోన్ లను మార్కెట్ లోకి దించింది. మ్యూజిక్ ప్లేయర్, మొబైల్ ట్రాకర్, మోషన్ సెన్సార్, బ్లూటూత్, జిపిఆర్ ఎస్ వంటి ఫీచర్ లు గల ఫోన్ ను v -1604 పేరిట 5,500 రూపాయలకే విక్రయిస్తోంది.
Pages: -1- 2 -3- News Posted: 26 January, 2010
|