ధీటుగా దేశీయ సెల్ ఫోన్లు
దేళీయ బ్రాండ్లలో మొట్టమొదటగా ప్రవేశించిన స్పైస్ కంపెనీ తొలిసారిగా డ్యూయల్ సిమ్ ఫోన్ లను శ్రీకారం చేసింది. టచ్ స్క్రీన్, విండోస్ 6.0తో స్పైస్ D - 1111 మొడల్ ను దింపింది. అలాగే S- 950 పేరిట ప్రవేశపెట్టిన స్లైడర్ మొడల్ ను ఈ సంస్థ 9000 రూపాయలకే విక్రయిస్తోంది. 1900 రూపాయల నుండి వివిధ మోడల్స్ ను స్పైస్ తయారుచేసి మార్కెట్ లో విక్రయిస్తోంది. సేల్స్ అండ్ సర్వీసు ను అందిస్తుండటం ఈ సంస్థ ప్రత్యేకత.
అలాగే లావా ఫోన్ ల కంపెనీ కూడా ఇతర కంపెనీలకు ధీటుగా విక్రయాలు సాగిస్తోంది. డ్యూయల్ సిమ్, డ్యూయల్ ఎల్ ఇ డి, పవర్ ఫుల్ టార్చ్, కెమెరా, గేమ్స్, బ్లూటూత్, 8 జి బి కెమెరా వంటి ఫీచర్ లతో KKT-1,KKT-11, KKT- 12 వంటి మోడళ్లు కేవలం 2,500 రూపాయలకు ఆఫర్ చేస్తోంది.
దేశీయ మొబైల్ కంపెనీలో కీలకమైన మ్యాక్స్ కంపెనీ కూడా మార్కెట్ లో భారీ అమ్మకాలు సాగిస్తోంది. GC121, GC333, GC343,GC1000 వంటి మోడల్స్ 3,200 నుండి 5,800 ధరలను నిర్ణయించింది. అలాగే టచ్ స్క్రీన్, బ్లూటూత్, ఎఫ్ ఎం, ఎంపీ త్రీ ప్లేయర్ సౌలభ్యం గల మ్యాక్స్ -333 మోడల్ ఫోన్ కేవలం 3,000 ఈ సంస్థ విక్రయించి ప్రత్యర్ధి కంపెనీలకు సవాల్ విసిరుతోంది.
అయితే అత్యాధునిక ఫీచర్ లు గల ఫోన్ లను నోకియా, శ్యామ్ సంగ్ వంటి కంపెనీలు 10000 నుండి 30000 మధ్య విక్రయిస్తుండటంతో, అవే ఫీచర్ లతో కూడిన దేశీయ మొబైల్స్ ఆరు వేల రూపాయలకు తక్కువకే విక్రయిస్తుండటంతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
Pages: -1- -2- 3 News Posted: 26 January, 2010
|