పెళ్ళికూతుళ్ళదే హవా! అయితే, వధువుల కోసం ఇలా వేచి ఉండవలసిరావడానికి ప్రధాన కారణం అమ్మాయిలు, అబ్బాయిల నిష్పత్తి తగ్గిపోవడమేనని దివ్యధామ్ పడిగల్ కు చెందిన శరణథ గోపాలన్ పేర్కొన్నారు. 'ఒక శిశువు చాలుననుకోవడం, మగ పిల్లల కోసం ఇంకా తాపత్రయపడుతుండడం వల్ల అమ్మాయిల సంఖ్య తగ్గిపోతున్నది' అని ఆయన చెప్పారు.
ఎన్ఆర్ఐ వరులు మోసాలు అదేపనిగా జరుగుతుండడం వల్ల విదేశీ సంబంధాలపై మోజు తగ్గిపోయింది. 'అంతేకాకుండా చాలా మంది యువతులు తమ మాస్టర్స్ డిగ్రీలను పూర్తి చేస్తున్నందున అంతగా చదువుకోని వరులకు జీతం బాగానే వస్తున్నప్పటికీ సంబంధాలు దొరకడం కష్టం అవుతున్నది' అని పెళ్లి సంబంధాల సంస్థ 'మ్యారేజ్ టుడే'కు చెందిన సులోచన రాజ్ చెప్పారు.
వరుల క్యూ పెరగడానికి మరొక కారణం కూడా లేకపోలేదు. యువతులు తమ కెరీర్ కోసం వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 'గతంలో వివాహ సంబంధాల కోసం పేర్లు నమోదు చేసుకునే యువతుల సగటు వయస్సు 18, 23 మధ్య ఉంటుండేది. అది ఇప్పుడు 23, 26 మధ్య ఉంటున్నది. లేదా ఇంకా ఎక్కువ కావచ్చు. వివాహానికి సిద్ధపడే ముందు తమ కెరీర్ లో కొన్ని మైలురాళ్లను అందుకోవాలని యువతులు ఆకాంక్షిస్తున్నారు' అని మురుగవేల్ వివరించారు. పెళ్లి సంబంధం కోసం ప్రతి నెల 200 మంది అబ్బాయిలు పేర్లు నమోదు చేసుకుంటుండగా దాదాపు 50 మంది అమ్మాయిలు మాత్రమే పేర్లు నమోదు చేసుకుంటున్నారని రుక్మిణి తెలిపారు.
ఇవి కేవలం గణాంకాలేనా? లేక దీనికి ఏదైనా ప్రాముఖ్యం ఉందా? అని ఆలోచిస్తే ఆసక్తికరమైనా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. భారతదేశంలో పితృస్వామ్యం క్రమంగా అంతరించి మాతృస్వామ్యానికి బాట వేస్తున్నదా? మహిళలు నెమ్మదిగానైనా పైచేయి సాధిస్తున్నారా? పెళ్లిళ్ల మార్కెట్ లో అడుగుపెడుతున్న మహిళల సంఖ్య తక్కువగా ఉంటున్నదా? పెళ్లిని జీవిత పరమావధిగా మహిళలు ఇక ఎంత మాత్రం భావించడం లేదా? పురుషుల వలె కాకుండా మహిళలు సాంప్రదాయిక పెళ్లిళ్ల మార్కెట్ వెలుపల భర్తలను వెతుక్కుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించవలసి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 27 January, 2010
|