'కారు'చౌక విమానం!
ముంబై : విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కారు ధరకు ఒక విమానం కొంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాప కింద నీరులా ఇటువంటి కొనుగోళ్ళు జరుగుతున్నాయి. అంతేకాదు.ఈ ధోరణి క్రమంగా ప్రబలుతోంది. ఈ విమానం ధర కేవలం 70 లక్షల రూపాయలు మాత్రమే . ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిని వృద్ధి చెందుతున్న మన దేశంలో బిలియనీర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నందున వ్యక్తులకు, క్లబ్బులకు, కంపెనీలకు విమానాల అమ్మకం నిమిత్తం పాశ్చాత్య విమాన తయారీ సంస్థలు బారులు తీరుతున్నాయి. అయితే, ఇవి వాణిజ్యపరంగా నిర్వహణకు కాకుండా విమాన ప్రయాణం హాబీగా మారిపోయినవారే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
జర్మన్ విమానాల తయారీ సంస్థ ఫ్లైట్ డిజైన్స్ తన భారతీయ పంపిణీదారు కార్వర్ ఏవియేషన్ ద్వారా రెండు సీట్ల టర్బో ఇంజన్ విమానం సిటిఎల్ఎస్ ను ప్రవేశపెట్టింది. దీని ఖరీదు అన్ని ఖర్చులతో కలిపి రూ. 90 లక్షలు. గగనయానానికి యోగ్యమైనదేంటూ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) జారీ చేసిన సర్టిఫికెట్ ను కూడా ఈ సంస్థ జత చేసింది.
Pages: 1 -2- News Posted: 2 February, 2010
|