అన్నిటికీ ఎటిఎం!
నిర్దిష్టమైన చారిటీ సంస్థలకు విరాళాలు పంపడానికి, కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల కొనుగోలుకు, ఇంటర్నెట్ ప్యాక్ లు, కాలింగ్ కార్డులకు తన ఎటిఎంలను ఉపయోగించుకునేందుకు ఐసిఐసిఐ బ్యాంకు వీలు కల్పిస్తున్నది. 2009 సంవత్సరంలో ఎటిఎంల పాపులారిటీని పెంచిన అత్యంత ముఖ్యమైన మార్పు ఇది.
ఏప్రిల్ లో ఏ బ్యాంకు అధీనంలోని ఎటిఎంలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చుననే ఉత్తర్వు జారీ అయింది. అంటే, ఖాతాదారుడు తనకు అకౌంటు లేని బ్యాంకు ఎటిఎం ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకున్నట్లయితే ఇతర బ్యాంకు ఎటిఎం వాడకం చార్జీలను అతని అకౌంట్ నుంచి మినహాయించరన్నమాట. అయితే, 2009 అక్టోబర్ 15 నుంచి కొన్ని పరిమితులను బ్యాంకులు విధించాయి. 'ఉచిత' లావాదేవీల సంఖ్యను నెలకు ఐదుకు పరిమితం చేశారు. అటువంటి ప్రతి లావాదేవీ రూ. 10 వేలకు మించరాదు. ఐదు లావాదేవీల పరిమితిని దాటినట్లయితే, ఒక్కొక్క లావాదేవీకి రూ. 20 వంతున చార్జీలను ఖాతాదారు అకౌంట్ లోకి జమ చేస్తారు. తమ సొంత ఎటిఎంలలో రోజుకు జరిగే నగదు విత్ డ్రాయల్స్ పై ఎంత పరిమితి విధించాలో బ్యాంకులే నిర్ణయిస్తున్నాయి. ఈ సమాచారాన్ని వాటి ఎటిఎం బూత్ లలో ప్రదర్శిస్తున్నారు.
ఎటిఎం లావాదేవీలకు సంబంధించి ఆర్ బిఐ జారీ చేసిన మరొక ఆదేశం 2009 జూలై 17 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, ఎటిఎం లావాదేవీ వైఫల్యం కారణంగా ఖాతాదారుని అకౌంట్ లో తప్పుగా డెబిట్ చేయడం జరిగినట్లయితే, ఆమేరకు ఫిర్యాదు వచ్చిన 12 పని దినాలలోగా ఆ తప్పును బ్యాంకులు సరిదిద్దవలసి ఉంటుంది. బ్యాంకు అలా చేయని పక్షంలో కస్టమర్లు రోజుకు రూ. 100 పరిహారానికి అర్హులవుతారు. ఈ మొత్తాన్ని క్లెయిము చేయవలసిన అవసరం లేకుండానే తిరిగి జమ చేసిన రోజు వారి అకౌంటులో జమ చేయవలసి ఉంటుంది
ఇతర బ్యాంకుల ఎటిఎంలను ఉపయోగించుకోవడం పెరిగిపోవడంతో విఫలమైన లావాదేవీ విషయంలో బాధ్యురాలిని చేయవలసిన బ్యాంకు గురించి కస్టమర్లు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఎటిఎం కార్డుతో ముడిపడిన అకౌంట్ ఉన్న బ్రాంచ్ లలో కస్టమర్లు ఫిర్యాదులు దాఖలు చేయాలని సూచిస్తూ ఎటిఎంల వద్ద నోటీసులు ప్రదర్శించాలని బ్యాంకులను 2009 డిసెంబర్ లో ఆర్ బిఐ ఆదేశించింది. ఎటిఎం ఏ బ్యాంకుదైతే ఆ బ్యాంకు సహాయ విభాగం (హెల్ప్ డెస్క్) టెలిఫోన్ నంబర్లను ప్రదర్శించాలని కూడా బ్యాంకులను ఆర్ బిఐ ఆదేశించింది.కస్టమర్లు తమ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్ళే బదులు బ్యాంకు ఫోన్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా లేక సమీపంలోని బ్రాంచ్ ద్వారా ఫిర్యాదులు దాఖలు చేయవచ్చేమో వాకబు చేయడం మంచిది.
Pages: -1- 2 News Posted: 5 February, 2010
|