కృష్ణపట్నంకు భారీ రుణం
ఈ విషయమై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ పవర్ నిరాకరించింది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ యూనిట్ కు రూ. 2.33 రేటుకు బిడ్ చేసింది. ఇదే కనిష్టం. లార్సెన్ టూబ్రో యూనిట్ కు రూ. 2.69, స్టెర్లైట్ ఇండస్ట్రీస్ యూనిట్ కు రూ. 4.20 రేటు సూచించాయి. ఈ ప్లాంటుకు ఇండోనీషియా నుంచి బొగ్గు సరఫరా జరుగుతుంది. విద్యుత్ ప్లాంట్లలో తక్కువ ఖరీదైన చైనీస్ పరికరాలను ఉపయోగిస్తున్నందున రిలయన్స్ తన బిడ్ ను తక్కువ స్థాయిలో ఉంచగలిగిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, దేశంలోనే ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉండడం సూపర్ క్రిటికల్ పరికరాల ఉత్పత్తి సంస్థలకు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఇప్పుడు యోచిస్తున్నది. ఇది భవిష్యత్తులో బిడ్ లలో అధిక రేట్లకు దారి తీయవచ్చు. ఎందుకంటే కంపెనీలు చౌక పరికరాల ఉత్పత్తి సంస్థలను తిరస్కరించవలసి రావచ్చు. దీనితో ధరలను అవి పెంచవలసి రావచ్చు.
ఆర్ పిఎల్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణపట్నం, ఝార్ఖండ్ లో తిలైయా విద్యుత్ ప్రాజెక్టులతో పాటు మధ్య ప్రదేశ్ లోని ససాన్ లో నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టు పనిని చేపట్టింది. రూ. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ససాన్ ప్రాజెక్టు ఒక సమగ్ర బొగ్గు గని అనుబంధితమైన తొలి విద్యుత్ కంపెనీ. ఇది 2014లో ఉత్పత్తిని ప్రారంభించవచ్చని ఆశిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 8 February, 2010
|